Vitamin E and Dry Fruits Benefits: విటమిన్ ఇ లేకపోతే ఆ రెండింటికీ ప్రమాదమే
Vitamin E and Dry Fruits Benefits: శరీరానికి అన్ని రకాల పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు చాలా అవసరమవుతుంటాయి. ఇందులో మరీ ముఖ్యంగా విటమిన్ ఇ. ఇది లోపిస్తే చాలా సమస్యలెదురవుతాయి. అందుకే తినే ఆహార పదార్ధంలో విటమిన్ ఇ తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి. అదేంటో పరిశీలిద్దాం.
Vitamin E and Dry Fruits Benefits: శరీరానికి అన్ని రకాల పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు చాలా అవసరమవుతుంటాయి. ఇందులో మరీ ముఖ్యంగా విటమిన్ ఇ. ఇది లోపిస్తే చాలా సమస్యలెదురవుతాయి. అందుకే తినే ఆహార పదార్ధంలో విటమిన్ ఇ తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి. అదేంటో పరిశీలిద్దాం.
మెరుగైన ఆరోగ్యానికి పోషక పదార్ధాలు, విటమిన్స్, ఖనిజ లవణాలు చాలా అవసరం. అందుకే విటమిన్ ఇ(Vitamin E)అవసరం అన్నింటికంటే ప్రధానం. విటమిన్ ఇ తక్కువైతే ఆ రెండు సమస్యలు వెంటాడుతాయి. ఒకటి చర్మ సంబంధిత వ్యాధులు. రెండవది కంటి చూపు సమస్య. మనిషి శరీరం మెకానిజంను బలోపేతం చేయడంలో ఈ విటమిన్ చాలా దోహదపడుతుంది. ఫ్రీ రాడికల్స్(Free Radicals) నుంచి రక్షిస్తుంది. యూవీ కిరణాల నుంచి చర్మాన్ని సంరక్షించేది విటమిన్ ఇ మాత్రమే. అందుకో దైనందిన ఆహారంలో తప్పకుండా విటమిన్ ఇ ఉండేట్టు చూసుకోవాలి.
మొదటిది బాదం(Almond). ఇందులో అనేక పోషకాలుంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అధిక స్థాయిలో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని రక్షిస్తుంది. అన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్(Anti Oxidants)లక్షణాలు ఇందులో ఉంటాయి. మరోవైపు బాదంలో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, కాపర్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇక రెండవది హాజెల్ నట్స్. ఇందులో కూడా విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది.సెల్ డ్యామేజ్ నుంచి నూటికి నూరుశాతం రక్షణ అందిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండి మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. హాజెల్ నట్స్‌లో ఉండే డైటరీ ఫైబర్ బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది.
ఇక మూడవది సన్ ఫ్లవర్ ఆయిల్. బియ్యం ఊక, గోధుమ జెర్మ్, ఆలివ్, పొద్దుతిరుగుడు, సోయాబీన్, మొక్కజొన్న నూనె మొదలైన కూరగాయల నూనెలు విటమిన్ ఇకు గొప్ప వనరులు. అన్ని కూరగాయల నూనెలు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. సన్ ఫ్లవర్ ఆయిల్‌లో(Sun Flower Oil) మాత్రం విటమిన్ ఈ అధికంగా ఉంటుంది. నాలుగవది అవకాడో. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండే పండు. శరీరానికి కావలసిన పోషకాలను పుష్కలంగా అందిస్తుంది. విటమిన్లు, ప్రొటీన్లు, ఫైబర్ అన్నీ ఉంటాయి. రోజుకు ఒక అవోకాడో తింటే చాలు శరీరానికి అవసరమైన మొత్తంలో విటమిన్ ఇ లభిస్తుంది. ఇక పొద్దు తిరుగుడు విత్తనాలు. కాల్చిన పొద్దు తిరుగుడు నూనె గింజలలో 75 శాతం కంటే ఎక్కువ విటమిన్ ఈ ఉంటుంది. మెరుగైన ఆరోగ్యం కోసం ఇది చాలా ఉపయోగం.
Also read: Green Tea: గ్రీన్ టీ ఏయే వేళల్లో తీసుకోకూడదు, ఎలా వాడుకలో వచ్చింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook