face mask for corona virus: వైరస్ అనేది ఒక మనిషి నుంచి మరో మనిషికి విపరీతంగా వ్యప్తిస్తుంది. ఈ వైరస్‌ గాలిలో వేగంగా మరొకరికి సోకుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని కోసమే మాస్క్‌లను ధరించాలని ఆరోగ్య వైద్యలు చెబుతున్నారు. అయితే మాస్క్‌ అనగానే చాలా మంది స్టయిల్‌లో దొరికే వాటిని ఉపయోగిస్తారు. కొంతమంది డిజైన్‌లు ఉన్న మాస్క్‌లను వాడుతూ ఉంటారు.కానీ ఈ మాస్క్‌ వల్ల వైరస్‌ రాకుండా ఉంటుందా? అనే ప్రశ్న అందరికి వస్తుంది. దీని కోసం ప్రస్తుతం మార్కెట్‌లో కొన్ని రకాల మాస్క్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మాస్క్‌లు వేసుకుంటే మనం సురక్షితంగా ఉండగలం అనే విషయంపై మనం ఇప్పుడు తెలుసుకుందాం..
 
♦ N-95: ఈ ఎన్‌ 95 మాస్కులు వైరస్‌ల నుంచి మనం రక్షణ పొందవచ్చు. ఇది సర్జికల్, క్లాత్ మాస్క్‌ల కన్నా మంచివని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

♦ క్లాత్  మాస్కులు: కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు నోటి తుంపరలు, జలుబు ఉన్నప్పుడు తుంపరలు వస్తాయి. దీని కారణంగా వైరస్‌ అనేది తర్వగా వ్యపిస్తుంది.ఈ సమస్య కోసం క్లాత్‌ మాస్కులు ధరించడం ఎంతో మేలు చేస్తుంది. అలాగే దీనిని ప్రతి రోజు ఉతకాలి లేకుంటే సూక్ష్మక్రిములు చేరుతాయి. 


Also Read: Pomegranate Peel: దానిమ్మ పండు తొక్కతో కలిగే లాభాల ఏంటో మీకు తెలుసా..?


♦ సర్జికల్‌ మాస్క్‌లు: చాలా మంది సర్జికల్‌ మాస్క్‌లు ధరిస్తున్నారు. దీనికి కారణం మాస్క్‌లు చవకగా దొరకడం,అలాగే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉండదు. కానీ ఆరోగ్య నిపుణుల ప్రకారం దీని ఒక్కసారి ధరించటానికి మాత్రమే పనికొస్తాయని చెబుతున్నారు. 


♦ ఫేస్‌ షీల్డ్స్‌: ఫేస్‌ షీల్డ్‌ మాస్క్‌లు వేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం చాలా తక్కువగా ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.వీటిని ధరించటం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఈ మాస్కులు వేసుకొనే ముందు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. 



ఇలాంటి మాస్క్‌లు ధరించడం వల్ల మనం హానికరమైన వైరస్‌ బారిన పడకుండా ఉంటామని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


Also Read: Heart Health Tips: ఈ ఐదు టిప్స్ పాటిస్తే గుండె పదికాలాలు పదిలం, ఎలాగంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter