COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Fennel Water For Belly Fat Weight Loss: ఆధునిక జీవన శైలిని అనుసరించే చాలామంది బరువు పెరగడమే కాకుండా కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి కఠిన తరమైన వ్యాయామాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారని వారు చెబుతున్నారు. మరికొందరైతే ఖరీదైన చికిత్సలను కూడా చేయించుకుంటున్నారు. బరువు తగ్గడానికి ఎలాంటి చికిత్సలు చేయించుకోనవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


✤ బరువు పెరగడం వల్ల చాలామందిలో అధిక రక్తపోటు సమస్యలతో పాటు గుండె సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఎంత తొందరగా శరీర బరువును నియంత్రించుకుంటే అంత మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. వేగంగా బరువు తగ్గాలనుకునేవారు ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.


✤ బరువు తగ్గడానికి సోంపు నీరు ప్రభావంతంగా పనిచేస్తుందని ఆయుర్వేదన గుణాలు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని వ్యర్ధపదార్థాలను కూడా బయటకు లాగేస్తాయి. కాబట్టి ఊబకాయాన్ని తగ్గించుకోవాలనుకునేవారు తప్పకుండా సోంపును వినియోగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా సులభంగా బెల్లీ ఫ్యాట్‌ నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. 


✤ సోంపు నీరు తాగడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు సులభంగా శరీరంలోని పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగిస్తాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా వచ్చే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.


Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..


✤ సోంపు నీరే కాకుండా బరువును తగ్గించుకోవడానికి వేయించిన సోంపు పొడి కూడా ప్రభావంతంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు శరీర బరువును తగ్గించడమే కాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. ఈ నీటిని తాగడం వల్ల పొట్ట ఉబ్బరం సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. 


✤ సోంపు నీరు లేదా పొడితో వేగంగా బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా సరైన పద్ధతిలో వీటిని వినియోగించాల్సి ఉంది. అయితే ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో ఒకటి స్పూన్ సోంపు పొడిని కలుపుకొని తాగాలి. లేదా రాతిరంతా నానబెట్టిన సోంపును ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాల్సి ఉంటుంది. ఇలా రెండు పద్ధతుల్లో సోంపును తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 


Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి