Diabetes: నిజంగా మెంతుల టీతో మధుమేహం తగ్గుతుందా.. ఇందులో ఉన్న నిజం ఎంత?
Fenugreek Tea Facts About Diabetes Control In Telugu: ప్రపంచవ్యాప్తంగా చాలామంది యువత మధుమేహం బారిన పడుతున్నారు. అయితే కొంతమందిలో రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరగడం వల్ల తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ నీటిని తాగాల్సి ఉంటుంది.
Fenugreek Tea Facts About Diabetes Control In Telugu: ఆధునిక జీవనశైలి కారణంగా ఆహారపు అలవాట్లలో కూడా భారీ మార్పులు వచ్చాయి. ప్రస్తుతం చాలామంది అనారోగ్యకరమైన ఆహారాలను అతిగా తీసుకుంటున్నారు. ఇలా తీసుకునే చాలామంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. చిన్న వయసులోనే మధుమేహం, గుండెపోటులకు గురవుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా చిన్న వయసులోనే డయాబెటిస్తో బాధపడేవారు ఆహారాలను డైట్ పద్ధతిలో తీసుకోవాలి. అయితే కొంతమందిలో రక్తంలోని చక్కెర పరిమాణాలు విపరీతంగా పెరిగి ప్రాణాలు కోల్పోతున్నారు.
కాబట్టి మధుమేహం ఉన్నవారిలో రక్తంలోని చక్కెర పరిమాణాలు ఎంత నియంత్రణలో ఉంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేకపోతే ప్రాహణాలకే ముప్పని వారంటున్నారు. అయితే ఈ రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరగకుండా నియంత్రించుకోవడానికి తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన చిట్కాలను పాటించాల్సిందే.. ఈ చిట్కాలను పాటించడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు తగ్గడమే కాకుండా శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించడానికి మెంతులతో తయారు చేసిన టీ ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు మధుమేహాన్ని సులభంగా నియంత్రిస్తాయి. అంతేకాకుండా తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడే వారు ఈ టీని రెగ్యులర్ గా తాగడం వల్ల గొప్ప ఉపశమనం పొందుతారు. ఈ మెంతి టీ లో ఉండే ఔషధ గుణాలు శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ ను కూడా సులభంగా కలిగిస్తాయి. అయితే ఈ టీ ని ప్రతిరోజు ఎన్నిసార్లు తాగాలో! ఈ టీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి : Loan Application For Defaulters: లోన్ ఎగ్గొట్టిన వాళ్లు మళ్లీ లోన్ కోసం అప్లై చేస్తే వస్తుందా ?
మెంతుల టీ తయారీ పద్ధతి:
ఈ టీ ని తయారు చేసుకోవడానికి ముందుగా రెండు చెంచాల మెంతులను తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని రెండు కప్పుల నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే స్టవ్ పై తెర్ల కాగనివ్వాలి. ఇలా రెండు కప్పుల నీళ్లు ఒక కప్పు అయిన తర్వాత.. ఈ టీ ని తీసుకుని ఒక చిన్న గ్లాసులో ఫిల్టర్ చేసి తేనె కలుపుకొని తాగడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. ఈ ఒక కప్పు టీ లో తేనెను చాలా తక్కువగా కలుపుకోవాల్సి ఉంటుంది. లేకపోతే రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరగవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : Loan Application For Defaulters: లోన్ ఎగ్గొట్టిన వాళ్లు మళ్లీ లోన్ కోసం అప్లై చేస్తే వస్తుందా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి