F9 For Fertility: ఆధునిక బిజీ ప్రపంచంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, తీవ్ర ఒత్తిడి వంటి కారణాలతో సంతానలేమి ప్రధాన సమస్యగా మారుతోంది. ఆ సమస్యతో బాధపడేవారి కోసమే ఫర్టీ 9. సంతానలేమికి తిరుగులేని పరిష్కారం ఫర్టీ9. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం మన  సమాజంలో చదువు, ఉద్యోగం, వివాహం, సంతానాన్ని పొందడం, ముద్దుముచ్చట్లతో ఆనందంగా జీవించడమే అందరికీ కావల్సింది. ఈక్రమంలో వివాహం వరకూ అన్ని సక్రమంగా సాగినా..సంతానం దశ మాత్రం ఆలస్యమైపోతుంది. సంతానం దశలో ఏకంగా పుల్ స్టాప్ పడిపోతుంటుంది. దీనికి కారణం వివిధ రకాల ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, ఆందోళనగా తెలుస్తోంది. ప్రస్తుతం సమాజంలో 40 శాతమంది దంపతులు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. పిల్లల కోసం తపస్సు చేస్తున్నామని అంటున్నారంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. 


ఇక సంతానలేమికి దారితీసే ఇతర ముఖ్యమైన కారణాలు


పురుషులలో  సంతానలేమి సమస్య..కారణాలు :


పురుషులలో సెక్స్ కోరికలు కలగడానికి ప్రధానంగా టెస్టోస్టీరాన్ హార్మోన్ అవసరం. దీనితోపాటు సంతానోత్పత్తికి ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ( FSH), ల్యుటినైజింగ్  హార్మోన్ ( LH )కూడా అవసరం. పురుషులలో ఈ హార్మోన్ల  పరిమాణం  తగినంతగా  లేకపోతే.. అది సంతానలేమి సమస్యకి దారితీస్తుంది. తగిన చికిత్స పొందితే.. పురుషులలో  సంతానలేమి సమస్య పరిష్కారమవుతుంది.


అదేవిధంగా స్త్రీలలో సంతాన సాఫల్యతకు, శారీరక  పరిపక్వతకు ఈస్ట్రోజెన్ హార్మోన్ అవసరం. దీనితోపాటు సంతానోత్పత్తికి ప్రొజెస్టిరోన్ హార్మోన్ అవసరం. స్త్రీలలో ఈ హార్మోన్ లోపం.. ప్రధానంగా సంతానలేమికి కారణం. వైద్యుడిని సంప్రదించి, తగిన చికిత్స పొందితే  స్త్రీలలో సంతానలేమి సమస్య పరిష్కారమవుతుంది.


మీ ఇన్ఫెర్టిలిటీ సమస్యకు సరైన పరిష్కారాన్ని, మీరు ఆశించిన  ఫలితాన్ని మీకందించే  అత్యుత్తమ ఫెర్టిలిటీ క్లినిక్ ' ఫర్టీ 9 ' సంతాన సాఫల్యత చికిత్సారంగంలో అత్యాధునిక  సాంకేతికతతో కూడిన చికిత్సా విధానాలను అందించడంలో ఫర్టీ 9 అగ్రగామి. 


సంతాన సాఫల్యతకు ఫర్టీ 9 అందించే అత్యుత్తమ చికిత్సా విధానాలు :


IVF: ఈ  విధానంలో స్త్రీ అండాశయం నుంచి సర్జికల్ పద్ధతిలో అండాలను సేకరించి, ల్యాబొరేటరీలో పురుషుని స్పెర్మ్ సెల్స్‌తో ఫలదీకరించి.. పిండాన్ని ఉత్పత్తి చేస్తారు. తర్వాత ఈ పిండాన్ని స్త్రీ గర్భాశయంలోకి  ప్రవేశపెడతారు. అత్యంత అధునాతనమైన ఈ  చికిత్సా విధానం.. సంతానలేమికి  అత్యుత్తమ పరిష్కారంగా పేరొందింది.


ఐయూఐ :  ఈ పద్ధతిలో పురుషుని నుంచి ఆరోగ్యకరమైన స్పెర్మ్ సెల్స్‌ను సేకరించి, వాటిని అండోత్పత్తి జరిగే సమయంలో స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఈ  విధంగా  ప్రవేశపెట్టిన స్పెర్మ్ సెల్స్ ఫాలోపియన్ ట్యూబ్‌లోకి చేరతాయి. అక్కడ అండంతో కలిసి ఫలదీకరణ చెందుతాయి. ఫలితంగా సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఇది పిండంగా అభివృద్ధి చెందుతుంది


ఇంతటి అధునాతన పద్ధతులను పాటిస్తున్నందునే ఫర్టీ 9 అనేది అనతికాలంలోనే అద్భుత ఫలితాలనిచ్చే సంతాన సాఫల్య కేంద్రంగా ప్రాచుర్యం పొందింది.
అందుకే...ఫర్టీ 9 అంటే సంతానం..ఫర్టీ 9 అంటే సంతోషం


మరిన్ని ఇతర వివరాలకు సంప్రదించాల్సిన WEBSITE: ferty9.com
PHONE NUMBER:   +919392914044


Also read: Honey Benefits: తేనెను రోజూ ఇలా సేవిస్తే చాలు..5 వారాల్లో 10 కిలోలు తగ్గడం ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook