Food Items: ఆకలి అనేది చాలా సందర్భాల్లో తప్పుడు నిర్ణయాలకు దారి తీస్తుంది. ఆకలి కారణంగా ఏదైనా తినేయాలన్పిస్తుంది. అదే వివిధ రకాల సమస్యలకు కారణమవుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆకలేసినప్పుడు మనం ముందూ వెనుకా చూడకుండా కన్పించిన ఆహార పదార్ధాల్ని తింటుంటాం. అది మన తప్పు కాదు. ఆకలి మనతో అలా చేయిస్తుంది. అయితే అదే ఆరోగ్యపరంగా సమస్యగా మారుతుంది. కొన్ని రకాల ఆహార పదార్ధాలు ఆరోగ్యకరంగా మంచివే అయినప్పటికీ ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదనే విషయాల్ని పట్టించుకోరు. ఇదే పలు ఇబ్బందులకు దారి తీస్తుంది. మనం చేసే ప్రధానమైన తప్పు..ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు అంటే పరగడుపున కొన్ని రకాల ఆహార పదార్ధాల్ని తీసుకోవడమే. ఇది జీర్ణప్రక్రియకు సంబంధించి సమస్య తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ అల్సర్లు, యాసిడ్ రిఫ్లక్స్, మలబద్ధకం వంటివి తీవ్రమైన అసౌకర్యాలుగా మారుతాయి. పరగడుపున తీసుకోకూడదని కొన్ని ఆహార పదార్ధాలు ఏంటనేది తెలుసుకుందాం.


టొమాటోలు (Tomatoes): టొమాటోలో అధిక మొత్తంలో ఉండే టానిక్ యాసిడ్ కారణంగా కడుపులో ఎసిడిటీ పెరుగుతుంది. గ్యాస్ట్రిక్ జ్యూస్ అధిక మొత్తంలో వెలువడుతుంది. విటమిన్ సి కారణంగా హార్ట్‌బర్న్, గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి. మెడికేషన్‌లో ఉన్నప్పుడైతే కచ్చితంగా పరగడుపున టొమాటోలు తీసుకోవడం మానేయాల్సి ఉంటుంది. 


సోడా (Soda): సోడా అనేది హై షుగర్ కలిగిన పదార్ధం. పరగడుపున ఎప్పుడూ సేవించకూడదు. ఇది చాలా తప్పుడు నిర్ణయం. మీ శీరర మెటోబొలిజంను ఇది బలహీనపరుస్తుంది. సోడాలోని షుగర్ నేరుగా రక్తంలో కలిసిపోతుంది. ఎందుకంటే కడుపులో ఆహారం ఉండదు కాబట్టి. ఫలితంగా రక్త నాళాలు వెడల్పై..పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.


ఆకు కూరలు ( Green vegetables): ఆకు కూరలనగానే సాధారణంగా చాలా రకాల ఆరోగ్యపరమైన ప్రయోజనాలుంటాయని తెలుసు. అందుకే పరగడుపున గ్రీనీ వెజిటెబుల్స్ తీసుకోవడం మంచిదే అనుకుంటారు. కానీ వెజిటెబుల్స్‌లో అధిక మొత్తంలో ఉండే ఎమైనా యాసిడ్స్ కారణంగా హార్ట్‌బర్న్, కడుపునొప్పి సమస్యలు వస్తాయి. అందుకే వెజిటెబుల్స్ పరగడుపున తీసుకోకూడదు.


పెరుగు ( Yogurt): ఉదయం వేళల్లో బ్రేక్‌ఫాస్ట్‌గా ఎక్కువగా పెరుగును తీసుకోవడం చాలా సహజంగా కన్పిస్తుంది. పెరుగులో ఉండే బ్యాక్టీరియా ఉండే కడుపులోని మంచి బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఇది ఎసిడిటీని ఫ్లాట్యులెన్స్‌కు దారి తీస్తుంది.


కారపు పదార్ధాలు (Spicy Foods): స్పైసీ ఫుడ్స్‌ను ఇష్టపడని వారుండరు. అయితే పరగడుపున మాత్రం ఇది అంత మంచిది కాదు. స్పైసీ ఫుడ్ ఏదైనా సరే..గ్యాస్ట్రిక్ వాల్‌ను దెబ్బతీస్తుంది. యాసిడ్ సిక్రియేషన్‌ను పెంచుతుంది. స్టొమాక్ వాల్, అంతర్గత మ్యూకోసాను దెబ్బతీస్తుంది. ఫలితంగా అల్సర్లకు కూడా కారణమవుతుంది. 


Also read: Corona Pandemic: రోజూ పాలలో పసుపు కలుపుకుని తాగితే ఏం జరుగుతుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.