Ragi Vegetable Soup Recipe: రాగులతో వివిధ వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. రాగులతో చేసే వంటకాలు శరీరానికి అనేక రకమైన పోషకాలను అందిస్తాయి. అయితే రాగితో జావ మాత్రమే కాకుండా వెజ్‌ సూప్‌ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ సూప్‌ను ప్రతిరోజు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుకుండా ఉంటామని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  దీనిని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాగి వెజిటేబుల్స్ సూప్‌కి కావాల్సిన ప‌దార్థాలు: 


రెండు టీ స్పూన్స్‌ రాగిపిండి, ఒక టేబుల్ స్పూన్ బ‌ట‌ర్, అర టీ స్పూన్ వెల్లుల్లి , పావు క‌ప్పు ఉల్లిపాయ త‌రుగు, పావు క‌ప్పు
తరిగిన క్యారెట్ ముక్క‌లు, పావు క‌ప్పు బీన్స్ ముక్క‌లు, చిన్న‌గా త‌రిగిన ట‌మాట ముక్క‌లు పావు క‌ప్పు, నీళ్లు ఒక‌టిన్న‌ర గ్లాస్, ఉప్పు , మిరియాల పొడి అర టీ స్పూన్, పంచ‌దార పావు టీ స్పూన్, వెనిగ‌ర్ ఒక టీ స్పూన్.


రాగి వెజ్ సూప్ త‌యారీ విధానం: 


ముందుగా ఒక గిన్నెలో రాగిపిండిని తీసుకోవాలి.  అందులోకి నీళ్లు పోసి  క‌లుపుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో బ‌ట‌ర్ వేడి చేయాలి. అందులోకి వెల్లుల్లి త‌రుగు, ఉల్లిపాయ త‌రుగు, క్యారెట్ త‌రుగు, బీన్స్ త‌రుగు, స్వీట్ కార్న్ వేసి వేయించాలి. వీటిని ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి.  త‌రువాత టమాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు క‌లుపుతూ వేయించాలి. నీళ్లు, ఉప్పు, మిరియాల పొడి, పంచ‌దార‌ వేసి క‌ల‌పాలి. త‌రువాత నీటిని బాగా మ‌రిగించాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత ముందుగా క‌లిపి పెట్టుకున్న‌ రాగి పిండిని వేసి క‌ల‌పాలి.


ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రాగి సూప్ త‌యార‌వుతుంది. ఈ విధంగా రాగి సూప్ ను త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల  చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు.


Also Read:  Jonna Ambali: జొన్న అంబ‌లి లాభాలు ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter