Beetroot side effects and reactions: సహజంగా బీట్రూట్ ఎన్నో పోషకాలను ఇమిడి ఉంది..  ముఖ్యంగా రక్తహీనత సమస్యతో బాధపడేవారు కచ్చితంగా బీట్రూట్ తినాలి.. అని వైద్యులు చెబుతూ ఉంటారు.. అయితే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా అని అధికంగా తింటే మాత్రం అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకోవాల్సిందే అంటూ హెచ్చరిస్తున్నారు కూడా.. మరి బీట్రూట్ అధికంగా తినడం వల్ల జరిగే నష్టం ఏమిటి?  అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డయాబెటిస్ రోగులకు ప్రమాదం..


బీట్రూట్ అధికంగా తినడం వల్ల కలిగే సమస్యలలో ప్రధానమైనది.. నరాల బలహీనత ముఖ్యంగా డయాబెటిస్..వ్యాధిగ్రస్తులు బీట్రూట్ తినడం వల్ల నరాలు దెబ్బ తినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా బీట్రూట్ రసం తాగడం వల్ల శరీరంలో ఫైబర్ తగ్గిపోయి.. గ్లైసమిక్ లోడ్ పెరుగుతుంది. ఫలితంగా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.. కాబట్టి డయాబెటిస్ తో బాధపడేవారు బీట్రూట్ కి దూరంగా ఉండటమే మంచిది. 


చలి , జ్వరం,  పిత్తాశయంలో రాళ్లు..


సాధారణంగా బీట్రూట్ తిన్నప్పుడు చర్మంపై దద్దుర్లు, చలి , జ్వరం, దురద, పిత్తాశయంలో రాళ్లు ఇలాంటి సమస్యలు అధికమవుతాయి.. ఎవరైనా ఎప్పుడైనా బీట్రూట్ తిన్నప్పుడు.. చర్మంపై దద్దుర్లు లాంటి సమస్యలు ఏర్పడినట్టు  గుర్తిస్తే అలాంటి వారు కూడా బీట్రూట్ కి దూరంగా ఉండాల్సిందే..


అనాఫిలాక్సిస్ వ్యాధి:


సాధారణంగా అన్ని రకాల కాయగూరలు అన్ని శరీరాలకు సరిపడతాయి అంటే చెప్పలేని పరిస్థితి.. ఒక్కొక్క శరీర తత్వాన్ని బట్టి ఒక్కొక్క వెజిటబుల్ వారికి వంటబడుతుంది. ముఖ్యంగా బీట్రూట్ ఎక్కువగా తినడం వల్ల.. అనాఫిలాక్సిస్ అని తీవ్రమైన అలర్జీ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమస్య వల్ల శరీరం మరింత సున్నితంగా మారిపోయి. ఫలితంగా గొంతు సమస్యలు కూడా అధికమవుతాయి. 


బీట్రూట్ వల్ల కలిగే ప్రయోజనాలు..


అయితే వారానికి ఒకసారి లేదా నెలకు మూడుసార్లు బీట్రూట్ తినడం వల్ల.. ఇందులో ఉండే నైట్రేట్స్ ను తిన్న తర్వాత శరీరం నైట్రిక్ ఆక్సైడ్ గా మారుస్తుంది.. ఇది రక్తనాళాలను సడలించడం,  విస్తరించే సమ్మేళనం అని చెప్పవచ్చు.. అంతేకాదు రక్తప్రసరణకు దోహద పడి రక్తపోటును తగ్గిస్తుంది. ఫలితంగా హృదయ సంబంధిత వ్యాధులు కూడా దూరం అవుతాయి.. అధిక రక్తపోటును దూరం చేసుకోవచ్చు. రక్తహీనత సమస్యతో బాధపడే వారు కూడా బీట్రూట్ తినవచ్చు.. ముఖ్యంగా గర్భవతులు ఉదయాన్నే వారంలో రెండుసార్లు బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని కూడా గైనకాలజిస్ట్లు సలహా ఇస్తూ ఉంటారు. ఇక బీట్రూట్ వల్ల ఎంత ప్రయోజనం ఉందో అంతే ఆ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏదైనా మోతాదుకు మించి తీసుకోకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


Also Read: YS Jagan Odarpu Yatra: మరో ఓదార్పు యాత్ర.. వినుకొండ నుంచే వైఎస్‌ జగన్‌ మొదలు?


Also Read: AP Assembly Session: అసెంబ్లీకి వైఎస్ జగన్‌ వెళ్తారా? లేదా చంద్రబాబులా బహిష్కరిస్తారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter