Heart Health: గుండె కొట్టుకోవడం ఆకస్మికంగా ఆగిపోవడం వల్ల పలువురు వ్యక్తులు క్షణాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం చాలా మంది ఇలానే మరణిస్తున్నారు. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్‌ పరిమాణాలు పెరిగిపోవడం వల్ల ధమనుల్లో కొవ్వు పేరుకుపోతోంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండ గుండె ఆరోగ్యంగా ఉండడానికి సప్లిమెంట్ కూడా ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. వాటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గిన పలు రకాల దుష్ప్రభావాలు కలుగుతాయి. అయితే వీటికి బదులుగా ఈ కింది ఆహారాలు ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సప్లిమెంట్లు ప్రయోజనకరంగా ఉంటాయి:
తగిన మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కాబట్టి దీని కోసం ప్రతి రోజూ మీరు ఆహారంలో పండ్లు, కూరగాయలు తీసుకోవాల్సి ఉంటుంది. విటమిన్, ఖనిజాల లోపం ఉన్నవారు తప్పకుండా పలు రకాల ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.


ఫైబర్స్:
శరీరానికి కరిగే, కరగని ఫైబర్ సప్లిమెంట్స్ మంచి ప్రయోజనాలను కలిగిస్తాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడువారు తప్పకుండా ఆహారంలో కరిగే ఫైబర్‌ అధికంగా ఉండే ఆహారాలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఫైబర్ సప్లిమెంట్లు శరీరంలోని కొలెస్ట్రాల్ మొత్తాన్నికరిగించడానికి సహాయపడుతుంది.


ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్:
గుండెకు అత్యంత హాని కలిగించే ట్రైగ్లిజరైడ్‌లను నియంత్రించడానికి  ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ప్రభావవంతంగా సహాయపడతాయి. చేపలు తినడం, చేప నూనెను సప్లిమెంట్‌గా తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.


మెగ్నీషియం:
శరీరంలో మెగ్నీషియం లోపం ఉండడం వల్ల గుండె సంబంధిత సమస్యలు పెరిగే అవకాశాలున్నాయి. మెగ్నీషియం లోపం నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి మెగ్నీషియం సప్లిమెంట్స్‌ను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వైద్యులను సంప్రదించడం చాలా మంచిది.


అల్లం:
అల్లం ఒక సహజ సప్లిమెంట్. ఇది గుండెకు సంబంధించిన అనేక సమస్యలను దూరం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరంలో అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. రక్తం గడ్డకట్టడం తగ్గించి రక్తస్రావం అయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.


Also Read:  Rahul Sipligunj : బికినీ భామలతో రాహుల్ సిప్లిగంజ్ రొమాన్స్.. బడ్జెట్ బద్దల్ బాషింగాలైంతాందట!


Also Read: Naga Chaitanya - Samantha : నాగ చైతన్య అంటే మరీ అంత ద్వేషమా?.. అందుకే అలా చేసిందా? సమంతకు చైతూకి అదే తేడా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook