భోజనం మనం బ్రతకటానికి వమరియు మన ఆరోగ్యానికి ఎంత అవసరమో అందరికి తెలిసిందే. ప్రతి ఆహార పదార్ధాన్ని తినడానికి సరైన సమయం ఉంటుంది. అలాగే కొన్ని ఆహారాలను ఖాళీ కడుపు తో తినకూడదు అని ఆహార నిపుణులు సలహా ఇస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీటిల్లో అసిడిక్ ఆహారాలను ఖాళీ కడుపుతో తినడం వల్ల పొట్ట మరియు ప్రేగులపై చెడు ప్రభావం పడుతుంది. అంతేకాకుండా.. వీటి వలన ఇన్ఫెక్షన్ కూడా కలిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఏ ఆహారాలు తినాలి.. తినకూడదో ఇపుడు తెలుసుకుందాం. 


ఖాళీ కడుపుతో తినే ఆహార పదార్ధాలు: 
గుడ్డు..   

గుడ్లు ప్రోటీన్ పుష్కలంగా కలిగి ఉంటాయి. కావున వీటిని అల్పాహారంగా తీసుకోవాచ్చు. ఉదయాన్నే గుడ్డు తినడం వల్ల రోజంతా కడుపు నిండుగా ఉంటుంది మరియు శరీరానికి శక్తి కూడా లభిస్తుంది. 


బొప్పాయి పండు.. 
బొప్పాయి పండు ఒక గొప్ప సూపర్ ఫుడ్ అనటంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి సీజన్‌లో లభించే బొప్పాయిని మీ అల్పాహారంలో తీసుకోవచ్చు. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బులను కూడా నిరోధిస్తుంది. 


నానబెట్టిన బాదం.. 
ఉదయం లేవగానే ముందుగా ఖాళీ కడుపుతో 4 నానబెట్టిన బాదాంలను తినాలి. దీని వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.  ఫైబర్, ఒమేగా-3 మరియు ఒమేగా-6 యాసిడ్‌లు పుష్కలంగా ఉండే బాదంపప్పును రాత్రిపూట నానబెట్టి మరుసటి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినాలి. ఇలా నానబెట్టిన బత్తిన బాదం యొక్క పై తొక్కను తీసిన తర్వాత మాత్రమే తినాలని గుర్తుంచుకోవాలి. 


ఓట్స్.. 
ఓట్ మీల్ ఒక మంచి అల్పాహారం. ఇందులో  పోషకాలు అధికంగా ఉంటాయి మరియు కెలోరీలు తక్కువగా ఉంటాయి. ఇది శరీర బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. 


Also Read: Rahu Transit 2023: అక్టోబర్ 30 తేదిన మీనరాశిలోకి రాహువు సంచారం..ఈ 3 రాశులవారికి నష్టాలు తప్పవా?


ఖాళీ కడుపు తో తినకూడని ఆహార పదార్ధాలు  
టమాట..  

పచ్చి టమాటలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.  కానీ పచ్చి టమాటలను ఖాళీ కడుపుతో తినడం హానికరం. టొమాటోలోని అసిడిక్ గుణాలు.. పొట్టలో ఉండే జీర్ణాశయ ఆమ్లాలతో (గ్యాస్ట్రోఇంటెస్టినల్ యాసిడ్‌) చర్య జరిపి.. పొత్తికడుపులో నొప్పి.. తిమ్మిరి వంటి సమస్యలను కలిగించే జెల్‌ను ఏర్పరుస్తుంది. కావున ఉదయాన్నే ఖాళీ కడుపుతో టమాటలను తినకూడదు.


పెరుగు..  
పెరుగు వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. కానీ.. ఖాళీ కడుపు తో పెరుగుని తినకూడదు.పెరుగులో లాక్టిక్ ఆసిడ్ ఉంటుంది. ఉదయాన్నే ఖాళీ కడుపు తో పెరుగు తింటే.. అసాధారణ చర్యలు ఏర్పడి అనారోగ్యానికి గురిచేస్తుంది. 


సోడా.. 
సోడాలో అధిక నాణ్యత కలిగిన కార్బోనేట్ ఆసిడ్ ఉంటుంది. ఈ కార్బోనేట్ ఆసిడ్ పొట్టలో ఉండే ఆసిడ్ తో కలిస్తే.. కడుపు నొప్పి వంటి సమస్యలు ప్రారంభం అవుతాయి. కావున ఉదయాన్నే అల్పాహారంగా తీసుకోకూడదు.


Also Read: Realme C53 Price: రూ.14 వేల స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.649 ధరకే కొనేయండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook