Foods Improve Hemoglobin: శరీర రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోవాలి అనుకుంటే, తప్పకుండా, ఐరన్ సంబంధిత సంప్లిమెంట్స్ మరియు ఐరన్ స్థాయిలను ఎక్కువగా కలిగి ఉన్న ఆహారాలను తీసుకోవాలి. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచే కొన్ని రకాల ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది. ఐరన్ స్థాయిలు తక్కువగా కలిగి ఉన్న ఆహారాలు మరియు పోషకాహార లోపం కలిగిన వారిలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గే అవకాశం ఉంది. ఎక్కువ స్రావాలకు గురయ్యే స్త్రీలలో కూడా హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. రక్త స్రావాలు ఎక్కువగా అవటానికి ముఖ్య కారణం ఐరన్ లోపం, ఫలితంగా హోమోగ్లిబిన్ స్థాయిలు తగ్గుతాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెడ్ మీట్
రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెంచుకోవాలి అనుకుంటే మాత్రం, ఐరన్ లను ఎక్కువగా కలిగి ఉన్న ఆహారాలను తీసుకోవాలి. రెడ్ మీట్ అధిక మొత్తంలో ఐరన్ (త్వరగా గ్రహించబడే) ను కలిగి ఉంటుంది మరియు ఈ ఐరన్ పేగులచే వేగంగా గ్రహించబడుతుంది. నిజానికి, ఐరన్ ను అధిక మొత్తంలో కలిగి ఉన్న రెడ్ మీట్ ను ఎక్కువగా తినటం వలన గుండెపోటు లేదా హార్ట్ స్ట్రోక్ వంటివి కలుగుతాయి. అంతేకాకుండా, దీనిలో కొవ్వు పదార్థాల స్థాయిలు అధిక మొత్తంలో ఉంటాయి. వ్యాధులకు గురవకుండా, రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోటానికి, తినే ఆహారంలో సమతుల్య స్థాయిలో మాత్రమే రెడ్ మీట్ ను  తీసుకోవాలి.


Also Read: viral Wedding Dance: అదిరిపోయిన బావ-మరదలు డ్యాన్స్.. నెటిజన్లతో ఈల వేయిస్తున్న వీడియో


కూరగాయలు
అన్ని రకాల పచ్చని ఆకుకూరలు మరియు కొన్ని రకాల కూరగాయలు ఐరన్ కలిగి ఉంటాయి. బీట్ రూట్, టమోటాలు, పాలకూర, గ్రీన్ పీస్, రాజ్మా, క్యాబేజీ, టర్నిప్, చిలకడదుంప, క్యాప్సికం, మిరియాలు, గుమ్మడికాయ మరియు కాలీఫ్లవర్ వంటి కూరగాయలలో ఐరన్ ఉండటమే కాకుండా, మార్కెట్ లో సులభంగా లభిస్తాయి. బ్రోకలీ, లిమా బీన్స్ మరియు నల్లటి బీన్స్ వంటి కూరగాయలు తగిన స్థాయిలో ఐరన్ ఉంటుంది. రక్తం యొక్క స్థాయిలు పెంచుకోటానికి బీట్ రూట్ మంచి మార్గంగా చెప్పవచ్చు మరియు ఎర్ర రక్తకణాలను చైతన్యపరచి, రక్త ప్రసరణను అధికం చేస్తుంది. 


పండ్లు
తాజా పండ్లు మరియు డ్రైఫ్రూట్స్ వలన రక్త పరిమాణం పెరుగుతుంది. రక్తంలో చైతన్యవంతమైన ఎర్ర రక్తకణాల స్థాయిలను పెంచుకోటానికి అధిక మొత్తంలో డ్రై ఫ్రూట్, ప్రూనే, డ్రైఫిగ్స్, ఆప్రికాట్లు, జామపండ్లు, స్ట్రాబెర్రీలు, బొప్పాయి, ఆపిల్, ద్రాక్ష మరియు పుచ్చకాయలను అధికంగా తినండి. అంతేకాకుండా, ఆరెంజ్, ఉసిరి, నిమ్మ మరియు ద్రాక్ష పండ్ల వంటి సిట్రస్ జాతికి చెందిన పండ్లను మరియు ఐరన్ ఉపభాగాలను తీసుకోవటం వలన రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.


Also Read: Pushpa Movie Second Song: 'చూపే బంగారమాయెనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయెనే'..పుష్ప మ్యూజికల్ బీట్


హోల్ గ్రైన్స్
హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోటానికి, హోల్ గ్రైన్స్ ను తీసుకోండి. హోల్ గ్రైన్స్ సంబంధిత ఆహారాలు అయినట్టి, బ్రెడ్, పాస్తా మరియు తృణధాన్యాలను మీరు రోజు పాటించే ఆహార ప్రణాళికలో కలుపుకోండి. ఫుడ్ అండ్ న్యూట్రీషియన్ వారు తెలిపిన దాని ప్రకారం, రోజులో పురుషులు 8 మిల్లిగ్రాముల ఐరన్ మరియు స్త్రీలు 10 గ్రాముల ఐరన్ తీసుకోవాలని తెలిపారు. మీరు తినే హోల్ గ్రైన్స్ స్థాయిలను తెలుసుకోటానికి, ప్యాకెట్ పై ఉన్న లేబుల్ చూడండి.


నట్స్
ప్రతిరోజు నట్స్ తినటానికి ఇష్టం అనిపించదు కానీ, నట్స్ అధిక మొత్తంలో ఐరన్ ను కలిగి ఉంటాయి. అన్ని రకాల నట్స్ ల కన్నా, బాదం పప్పులో అధిక శాతం ఐరన్ ఉంటుంది. రోజు ఒక పిడికెడు బాదం పప్పులను తినటం వలన 6 శాతం ఐరన్ శరీరానికి అందించబడుతుంది. ఒకవేళ మీరు ఆస్తమా కలిగి ఉంటె మాత్రం, వేరుశనగను తినకండి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి