Healthy diet : సీజన్ మారే కొద్ది మనం తీసుకునే ఆహారంలో మార్పులు వస్తూ ఉంటాయి. మరి ముఖ్యంగా వర్షాకాలంలో ఎన్నో ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని రకాల ఆహార పదార్థాలకు మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కొన్ని రకాల ఫుడ్స్ ఈ సీజన్లో ఇన్ఫెక్షన్స్‌ని పెంచడంతోపాటు పలు రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. అందుకే ఈ సీజన్లో ఎటువంటి ఫుడ్స్ తీసుకోకూడదు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్రూట్ సలాడ్:


సాధారణంగా పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది కానీ అవి అప్పటికప్పుడు కట్ చేసుకుని తింటే మాత్రమే. మార్కెట్లో ఆల్రెడీ కట్ చేసిన ఫ్రూట్స్‌ని ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. మనం కూడా హెల్తీ అన్న ఉద్దేశంతో ఈ ఫ్రూట్ సలాడ్స్‌ని తింటాము. అయితే వానాకాలం ఇలా ఎక్కువసేపు కట్ చేసిన ఫ్రూట్స్‌లో బ్యాక్టీరియా చేరే అవకాశం  ఉంటుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అందుకే ఫ్రూట్స్ తినాలి అనుకుంటే ఇంటిదగ్గర శుభ్రంగా కట్ చేసి అప్పటికప్పుడు తినడం మంచిది.


డెయిరీ ప్రోడక్ట్స్:


వర్షాకాలంలో కాస్త వెచ్చగా తాగడానికి బాగుంటుంది అన్న ఉద్దేశంతో కాఫీ, టీ వంటివి ఎక్కువగా సేవిస్తాము. బయట నుంచి పన్నీర్, చీజ్ ఎక్కువగా ఉన్న ఐటమ్స్ ని కూడా తెప్పించుకొని తింటాం. కానీ ఇలా వర్షాకాలంలో ఎక్కువ డైరీ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల కడుపులో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. ఇవి త్వరగా జీర్ణం కాదు కాబట్టి కడుపులో మందం చేసే అవకాశం కూడా ఉంటుంది. రాత్రి పిల్లలకు పసుపు వేసి మరిగించిన పాలను ఇవ్వడం వల్ల అజీర్తి సమస్యలు తలెత్తవు.


ఫ్రై ఫుడ్స్:


చల్లని వాతావరణం లో తినడానికి హాయిగా ఉంటుంది అని సమోసా, పకోడా, వడలు లాంటి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ను ఎక్కువగా తింటాము. ఎక్కువ ఆయిల్ ఉన్న ఐటమ్స్ తినడం వల్ల బరువు పెరగడంతో పాటు ఉదర సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ సీజన్లో జంక్ ఫుడ్ వీలైనంత తక్కువగా తీసుకోవాలి.


స్ప్రౌట్స్


డైట్ పాటించేవారు ఎక్కువగా పొద్దున స్ప్రౌట్స్ ని అల్పాహారంగా తీసుకుంటారు. అయితే వర్షాకాలం మీరు ఆ పని చేయకుండా ఉంటే మంచిది. ఎందుకంటే స్ప్రౌట్స్ లో తేమ కారణంగా ఈ సీజన్లో ఎక్కువ మోతాదులో ఫంగస్, బ్యాక్టీరియా వంటివి ఉండే అవకాశం ఉంటుంది. వీటిని ఈ సీజన్లో ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకున్న మొలకలు తింటే పర్వాలేదు.. కానీ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని వీటిని వాడకపోవడమే మంచిది.


Also read: Uma Maheshwaram: నల్లమల్ల కొండల్లో ఆకర్షిస్తున్న జలపాతం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook