Anxiety Reduction Foods: ఈ ఆహారం తీసుకోండి.. ఒత్తిడి నుండి బయటపడటం ఖాయం
Foods to reduce anxiety: పనిఒత్తిడి లేదా ఇంట్లో ఒత్తిడి కారణంగా ఈ మధ్య చాలా మందిలో ఆందోళన, యాంగ్సైటి వంటివి పెరిగిపోతున్నాయి. కానీ తినే ఆహారంలో చిన్న మార్పులు, చేర్పులు చేయడం వల్ల.. మన మెదడుని మన కంట్రోల్ లో పెట్టుకోవచ్చు.. మెదడు పనితనాన్ని ఇంకా మెరుగుపరచుకోవచ్చు.
Foods to reduce stress : ఈ మధ్యకాలంలో పని ఒత్తిడి కారణంగా చాలామంది ఆందోళనకు గురవుతూఉన్నారు. దానివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. డిప్రెషన్ కి కూడా గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ అంతదాకా వెళ్లకుండా మనం తీసుకునే పౌష్టిక ఆహారమే.. పనిఒత్తిడి లేదా మరి ఏదైనా ఒత్తిడి పై ప్రభావం చూపుతుంది.
కాబట్టి సరైన సమయానికి మంచి ఆహారం తీసుకోవడం వల్ల.. ఎలాంటి మానసిక ఇబ్బందులు మన దరిచేరవు. అటు ఇంట్లో ఇటు ఆఫీస్ లో ఒత్తిడికి గురిఅవుతున్న వారు.. కచ్చితంగా ప్రతిరోజు వారు తినే ఆహారంలో.. కొన్ని కీలకమైనవి చేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ ఆహారమే మన ఒత్తిడిని కూడా నియంత్రిస్తుంది. మరి అవేవో ఒకసారి చూద్దాం..
బెర్రీ పండ్లు :
అసలే వేసవికాలం కాబట్టి పండ్లు తీసుకోవడం చాలా ముఖ్యం. అందులోనూ బెర్రీపళ్ళు తినడం వల్ల ఆందోళన, ఒత్తిడి తగ్గిపోతాయి. అందులో ఉండే పోషకాలు మన శరీరంలో భావోద్వేగాలను సమతుల్యం చేస్తాయి. ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసోల్ స్థాయిలను బాగా తగ్గించేస్తాయి.
ఆకుకూరలు :
ఆకుకూరల వల్ల శారీరకంగా ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో.. మానసికంగా కూడా అన్నే ఉపయోగాలు ఉంటాయి. ఆకుకూరలు మన మెదడులోని సెరొటోనిన్ ని పెంచుతాయి. మన మూడ్ మార్చడంలో, చక్కగా నిద్ర పట్టడంలో, ఆహారం సరిగ్గా జీర్ణం అవడంలో, గాయాలు త్వరగా మారడంతో పాటు.. ఎముకలు బలపడడం కూడా ఈ సెరొటోనిన్ హార్మోన్ వల్ల జరుగుతాయి. కాబట్టి ఆకుకూరలు ఎక్కువగా తినడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
డార్క్ చాక్లెట్ :
డార్క్ చాక్లెట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. మన మెదడు సరిగ్గా పనిచేసేలాగా చూస్తాయి. అంతేకాకుండా మన మెదడు కి చేరాల్సిన రక్తం సరిగ్గా చేరేలాగా చేసి, మెదడు పనితనాన్ని ఇంకా మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని నియంత్రిస్తుంది.
పెరుగు :
పెరుగు లో ఉండే మంచి బ్యాక్టీరియా.. జీర్ణ క్రియకి ఎంతగానో ఉపయోగపడుతుందని అందరికీ తెలిసిందే. కానీ అందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు.. మన మెదడు ఆరోగ్యం బాగుండడానికి ఉపయోగపడతాయి. ఆరు వారాల పాటు ప్రతిరోజు పెరుగు తింటే.. వారిలోని ఒత్తిడి చాలా వరకు తగ్గిపోయింది అని నిపుణులు చెబుతున్నారు.
బాదంపప్పు :
రోజు ఉదయం డ్రైఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా బాదంపప్పు తినడం వల్ల అందులో ఉండే విటమిన్ ఈ స్ట్రెస్ ను చాలా వరకు తగ్గించేస్తుంది.
మాంసం ఎక్కువగా తినడం వల్ల కూడా సెరొటోనిన్ పెరుగుతుంది. ఓట్ మీల్ కూడా మనల్ని ఒత్తిడి, ఆందోళనకు గురవకుండా చేస్తుంది. ఓట్స్ లో ఉండే పీచు పదార్థం మన శరీరానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇలా మంచి ఆహారం తీసుకుంటే.. శారీరకంగా మాత్రమే కాక మానసిక అనారోగ్యాలు కూడా మన దగ్గరికిరావు.
Also Read: India T20 World Cup Squad 2024: రోహిత్ సారథ్యంలోనే టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు.. రాహుల్‌కు షాక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter