Garlic Side Effects: చైనీస్ వెల్లుల్లితో జాగ్రత్త, కోమాలో వెళ్లే ప్రమాదం
Garlic Side Effects: ప్రకృతిలో లభించే వివిధ పదార్ధాల్లో ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను ఇచ్చేవి చాలా ఉంటాయి. అందులో ముఖ్యమైంది వెల్లుల్లి. ఆయుర్వేదంలో వెల్లుల్లికి చాలా ప్రాధాన్యత ఉంది. అందరికీ వెల్లుల్లి కల్గించే ప్రయోజనాల గురించే తెలుసు. కానీ వెల్లుల్లితో తీవ్రమైన నష్టం కూడా కలుగుతుందని ఎంతమందికి తెలుసు.
Garlic Side Effects: వెల్లుల్లి ప్రకృతిలో లభించే అద్భుతమైన దివ్య ఔషధం. కేవలం ఆయుర్వేదంలోనే కాదు దాదాపు అన్ని చికిత్సా విధానాల్లోనూ వెల్లుల్లి ప్రాముఖ్యత ఉంది. వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది. అందరికీ వెల్లుల్లితో కలిగే ప్రయోజనాల గురించే తెలుసు. కానీ వెల్లుల్లి తినడం వల్ల కోమాలో వెళ్లే ప్రమాదముందని మీకు తెలుసా..
వెల్లుల్లి ఆరోగ్యపరంగా మంచిదని సైన్స్ చెబుతుంటే కొన్ని మత గ్రంథాలు మాత్రం వెల్లుల్లికి దూరంగా ఉండాలంటాయి. వాస్తవానికి వెల్లుల్లి అనేది జలుబు నుంచి రక్తపోటు వరకు అన్నింటికీ అద్భుతంగా పనిచేస్తుంది. వెల్లుల్లిలో విటమిన్ సి, విటమిన్ బి6, మాంగనీస్, సెలేనియం ఉంటాయి. అయితే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఓ రకం వెల్లుల్లిలో విషపూరితమైన కెమికల్స్ ఉన్నాయని తెలుస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం 2014లో నిషేధించిన చైనా వెల్లుల్లి ఇండియాలో అక్రమ పద్ధతిలో విక్రయిస్తున్నారు. నిషేధించిన వెల్లుల్లిలో పెద్దమొత్తంలో క్రిమి సంహారక పదార్ధాలు ఉన్నాయి.
వెల్లుల్లికి ఫంగస్ పట్టకుండా ఉండేందుకు చైనా మిథైల్ బ్రోమైడ్ మిక్స్ అయిన ఒక ఫంగీసైడ్‌ను వినియోగించిందని జాదవ్ పూర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఒకరు తెలిపారు. అంతేకాకుండా క్లోరిన్ కూడా వినియోగించారని తేలింది. దీనివల్ల వెల్లుల్లిలో ఉండే క్రిములు నాశనమౌతాయి. వెల్లుల్లి కూడా తెల్లగా ఫ్రెష్‌గా కన్పిస్తుంది.
అయితే ఇందులో కలిపి మిథైల్ బ్రోమైడ్ చాలా హానికారకం. ఇదొక విషపూరితమైన రంగులేని గ్యాస్. క్రిమి సంహారక పనులకు ఉపయోగిస్తుంటారు. ఇది ఎక్కువ మోతాదులో వాడితే ఆరోగ్యానికి ప్రమాదకరం. మిథైల్ బ్రోమైడ్ కారణంగా ఊపిరితిత్తులు, కళ్లు, చర్మానికి హాని కలుగుతుంది. ఒక్కోసారి మనిషి కోమాలో కూడా వెళ్లే ప్రమాదముంది. అందుకే మార్కెట్‌లో లభించే వెల్లుల్లితో చాలా అప్రమత్తంగా ఉండాలి.
చైనా వెల్లుల్లి రెమ్మలు పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి.. తొక్కలపై బ్లూ, పర్పుల్ కలర్ గీతలు కన్పిస్తాయి. ఇలాంటి వెల్లుల్లి కన్పిస్తే దూరంగా ఉండండి.
Also read: IPL 2025 Mega Auction: మెగా ఆక్షన్‌కు ముందే కీలక మార్పులు, సీఎస్కే కొత్త కెప్టెన్‌గా రిషభ్ పంత్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.