Garlic Tea Benefits: టీ ఇష్టపడనివారు అంటూ ఉండరు. అందులోను  అల్లం టీ అంటే ఎంతో పేరు పొందిన టీ. దీని ఆరోగ్యలాభాలు గురించి ప్రతిఒక్కరికి తెలిసిందే. కానీ మీరు ఎప్పుడైనా గార్లిక్‌ టీ గురించి విన్నారా?  గార్లిక్ టీ అంటే వెల్లుల్లిని ఉడికించి తయారు చేసిన ఒక రకమైన ఆరోగ్య పానీయం. వెల్లుల్లిలో అనేక రకాల ఔషధ గుణాలు ఉండటం వల్ల ఈ టీకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వింతగా ఉన్నా ఇందులో బోలెడు లాభాలు ఉంటాయి. వెల్లుల్లి టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. వెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు శరీరాన్ని రోగాల నుంచి కాపాడుతుంది. దీని ప్రతిరోజు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో తెలుసుకుందాం. దీని ఎలా తయారు చేయాలి అనేది ఇక్కడ తెలుసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్లారిక్ టీ తయారీ విధానం:


వెల్లుల్లి: 2-3 రేకులు
నీరు: 1 కప్పు
నల్ల మిరియాలు: అర టీస్పూన్ 


తయారీ విధానం:


వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా తరిగితే మంచిది. ఇలా చేయడం వల్ల వెల్లుల్లి రసం నీటిలో బాగా కలుస్తుంది. ఒక పాత్రలో నీరు మరిగించండి. నీరు మరిగించిన తర్వాత, అందులో తరిగిన వెల్లుల్లిని వేసి కొద్దిసేపు మరిగించండి.  కాస్త స్పైసీ ఫ్లేవర్‌ని ఇష్టపడితే, ఈ దశలో నల్ల మిరియాలు కూడా వేయవచ్చు. కొన్ని నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి, ఈ మిశ్రమాన్ని ఒక కప్పులోకి వడకట్టండి. చక్కెర లేదా తేనె కలిపి తాగవచ్చు. కానీ, ఆరోగ్య ప్రయోజనాల కోసం చక్కెర లేకుండా తాగడమే మంచిది.


ఎప్పుడు తాగాలి:


ఉదయాన్నే ఉపవాసంగా తాగితే మంచి ఫలితం ఉంటుంది.
రాత్రి నిద్రకు ముందు కూడా తాగవచ్చు.


వెల్లుల్లి టీ వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు:


రోగ నిరోధక శక్తి పెరుగుదల: వెల్లుల్లిలో ఉండే అలసిన్ అనే పదార్థం రోగ నిరోధక శక్తిని పెంచి, జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గిస్తుంది.


గుండె ఆరోగ్యం: వెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తనాళాలను శుభ్రపరచి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.


రక్తపోటు నియంత్రణ: వెల్లుల్లి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.


జీర్ణక్రియ మెరుగుపడటం: వెల్లుల్లి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుంది.


బరువు తగ్గడం: వెల్లుల్లి జీవక్రియను వేగవంతం చేసి, బరువు తగ్గడంలో సహాయపడుతుంది.


క్యాన్సర్: వెల్లిల్లిలోని యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్‌లను నిరోధించే శక్తిని కలిగి ఉంటాయి.


చర్మ ఆరోగ్యం: వెల్లుల్లి చర్మ సంబంధిత సమస్యలను తగ్గించి, చర్మాన్ని మెరుగుపరుస్తుంది.


ముఖ్యమైన విషయాలు:


వెల్లుల్లి టీ తాగే ముందు మీ వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.
అధిక రక్తస్రావం సమస్య ఉన్నవారు, గర్భవతులు, పాలిచ్చే తల్లులు వెల్లుల్లిని అధికంగా తీసుకోకూడదు.
వెల్లుల్లి టీ రుచి కొంచెం ఘాటుగా ఉంటుంది. రుచిని మెరుగుపర్చుకోవడానికి తేనె లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు.


Disclaimer: 


ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్యుని సలహా తీసుకోవడం అత్యవసరం.
 


ఇది కూడా చదవండి: Plants For Study Room Vastu: మీ స్టడీ రూంలో ఈ ఐదు మొక్కలుంచితే ఏకాగ్రత పెరుగుతుంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.