Gastric Problem: గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే చిటికెలో మాయం..!
Gastric Problem Solution: తరచూ గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడేవారు.. వంటింట్లో ఉండే పదార్థాలతోనే గ్యాస్ట్రిక్ సమస్యను అధిగమించవచ్చు. ప్రస్తుతం ఎంతో మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య కోసం టాబ్లెట్లు వాడితే.. అది వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుందని కూడా కొంతమంది వాపోతున్నారు. ఈ క్రమంలో ఇంట్లోనే గ్యాస్ కి ఎలా చెక్ పెట్టొచ్చు చూద్దాం..
Gastric Problem Tips: ప్రస్తుత కాలంలో.. అప్పుడే పుట్టిన నెలల పిల్లల నుంచి పెద్దల వరకు.. అతిగా ఇబ్బంది పెడుతున్న సమస్య గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. కనీసం పసి పిల్లలు పాలు తాగినా సరే.. వారిలో గ్యాస్టిక్ సమస్య మరింత ఇబ్బందిని పెడుతోంది. ఇక పెద్దవారి విషయానికి వస్తే.. ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్, స్పైసీ ఫుడ్ తినడానికి మక్కువ చూపుతున్నారు. ఇలా తరచూ తినడం వల్ల అజీర్ణం లేదా గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. దీనివల్ల మనం ప్రతిరోజు.. ఇబ్బందులు పడవలసి వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు గ్యాస్ సమస్యల వల్ల కడుపు నొప్పి, ధమనులలో మంట కూడా వస్తూ ఉంటుంది. ఇలా గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది టాబ్లెట్లు వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఎలాంటి మందులు ఉపయోగించకుండా కేవలం చిన్నపాటి టిప్స్ ఉపయోగిస్తే చాలు ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు వాటి గురించి చూద్దాం.
పెరుగు
అందరి ఇళ్లల్లో ఎక్కువగా పెరుగు లభిస్తూ ఉంటుంది. పెరుగులోకి కాస్త.. జీలకర్ర పొడి వేసుకొని, కాస్త ఉప్పు కలిపి.. మజ్జిగ లాగా చేసుకుని తాగితే వెంటనే గ్యాస్ సమస్య నుంచి బయటపడవచ్చు.
సోంపు
సోంపు నానబెట్టిన.. నీటిని తాగడం వల్ల.. అజీర్ణంతో ఇబ్బంది పడుతున్న సమయంలో.. ఇది బాగా పనిచేస్తుంది. సోంపులో ఉండే పదార్థాలు.. కడుపులో ఉండేటువంటి గ్యాస్ ని పీల్చుకుంటాయి..
లవంగం
గ్యాస్ నొప్పి తో పాటు జలుబుతో ఇబ్బంది పడేవారుకి వారంలో కనీసం రెండుసార్లు లవంగాలను నమిలి.. ఆ రసం మింగితే గ్యాస్, జలుబు వంటి సమస్యలను సైతం దూరం చేసుకోవచ్చు.
మరిన్ని చిట్కాలు..
ఒకవేళ గ్యాస్ మరింత ఎక్కువగా ఉన్నట్లు అయితే.. ఒకే చోట కూర్చోకుండా.. నడవడం వల్ల కూడా అది సులువుగా బయటికి వచ్చేస్తుంది.
పొట్టలో గ్యాస్ సమస్యతో.. ఇబ్బంది పడుతున్న సమయంలో కడుపునొప్పి వచ్చిన వెంటనే వేడి నీటితో పొట్ట పైన మసాజ్ లాగా చేసుకుంటే వెచ్చదనం వల్ల గట్ కండరాలు సడలిస్తాయట.. వీటివల్ల ప్రేగుల నుంచి గ్యాస్ వాయువు బయటకి వచ్చేస్తుందట.
ఎక్కువగా ఆయిల్, జంక్ ఫుడ్ లను తినడం మానేయడం వల్ల కడుపులో గ్యాస్ సమస్య ఏర్పడదు. వీటితోపాటు ముఖ్యంగా సరైన సమయంలో భోజనం చేయకపోవడం వల్ల.. కూడా గ్యాస్ ఫామ్ అవుతుందని పలువురు నిపుణులు కూడా తెలియజేస్తున్నారు. సాధ్యమైనంతవరకు ఇలాంటి చిట్కాలను పాటిస్తే గ్యాస్ట్రిక్ సమస్య నుంచి బయటపడవచ్చు.
Also Read: కాంగ్రెస్ లో నరాలు తేగే ఉత్కంఠ.. రేపే మంత్రి వర్గ విస్తరణ..?.. ఆషాడం ఎఫెక్ట్..
Also Read: డిప్యూటీ సీఎం పేరు చెప్పి రైతు సూసైడ్.. భట్టీకి చెక్ పెట్టేదిశగా పావులంటూ జోరుగా చర్చలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి