Facial Treatment At Home: పండుగల్లో, ఫంక్షన్ లో ప్రత్యేకంగా కనిపించడం కోసం చాలా మంది పార్లర్‌లో ఎక్కువగా ఖర్చుచేస్తుంటారు. మరి కొంతమంది అంత బడ్జెట్‌ ఎందుకులేని ఖరీదైనా క్రీములు, ప్రొడెక్ట్స్‌ను ఉపయోగిస్తారు. కానీ వీటి వల్ల చర్మం కోమలత్వాన్ని కోల్పోతుంది. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే సహాజంగా కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. 
దీని కోసం మనం ఇంట్లో ఎల్లప్పుడు ఉపయోగించే పదార్థాలు ఉపయోగిస్తే సరిపోతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రైస్‌ వాటర్‌: 


బియ్యాం కడిగిన తరువాత చాలా మంచి ఆ నీటిని పారేస్తుంటారు. కానీ ఇందులో బోలెడు లాభాలు ఉన్నాయి. మీరు కాంతివంతమైన చర్మాన్ని పొందాలంటే ముందుగా బియ్యాన్ని బాగా కడిగి రాత్రంతా నానబెట్టాలి. దీని వడగట్టి ఆ నీటిలో అలోవెరా జెల్‌ను మిక్స్‌ చేసుకోవాలి. ఈ వాటర్‌ను టోనర్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే మొటిమలు, మరకలు, ముడతలు తగ్గుతాయి. 


సులభమైన ఫేస్‌ మాస్క్‌:


మార్కెట్‌లో వివిధ రకాల మాస్క్‌లు లభిస్తాయి. కానీ కొందరికి ఈ మాస్క్‌లు పడకుండా ఉంటాయి. అలాంటి సమయంలో ఇంట్లోనే సహాజంగా ఈ ఫేస్‌ మాస్క్‌ను తయారు చేసుకోవాచ్చు. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం. ముందుగా బియ్యం పిండి, పాలు, తేనె తీసుకోవాలి. వీటిని బాగా కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. అరగంట పాటు ఉంచుకొని ముఖాన్ని శుభ్రంగా తుడుచ్చుకోవాలి. వారంలో మూడు సార్లు ఈ ఫేస్ ప్యాక్‌ను ఉపయోగించడం వల్ల మంచిఫలితాలు పొందుతారు. 


సీరమ్‌: 


సీరమ్‌ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. కానీ వీటిని మార్కెట్‌లో కొనుగోలు చేయాలంటే ఎక్కువ ఖర్చు అవుతంది. అయితే ఎంతో సులభంగా ఇంట్లోనే ఫేస్‌ సీరమ్‌ తయారు చేసుకోవచ్చు. ముందుగా రెండు స్పూన్ల రైస్‌ వాటర్‌, విటమిన్‌ ఇ , కలబంద జెల్‌, గ్లిజరిన్‌ కలుపుకోవాలి. దీన్ని ఫేస్‌పైన  అప్లై చేసుకోవాలి. ఈ సీరమ్ ఉపయోగించడం వల్ల మచ్చలు, మొటిమలు, పొడి చర్మం వంటి సమస్యల తగ్గుతాయని చర్మంనిపుణులు చెబుతున్నారు. 


అయితే వీటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. అలాగే చర్మం కాంతివంతంగా కనిపించాలి అంటే విటమిన్ సి ఎక్కువగా లభించే ఆహారపదార్థాలు డైట్‌ లో భాగంగా తీసుకోవాల్సి ఉంటుంది. బయట లభించే ప్రొడెక్ట్స్‌ కంటే ఇలా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.  దీని వల్ల ఎలాంటి చర్మ సమస్యలు కలగకుండా ఉంటుంది. 


గమనిక: మీరు పైన చెప్పిన టిప్స్‌ను పాటించే ముందు చర్మ నిపుణుల  సలహా తీసుకోవడం చాలా మంచిది. వారు మీ చర్మంపై ఎలాంటి చిట్కాలు, ప్రొడెక్ట్స్‌ , క్రీములు ఉపయోగించాలి అనేది చెబుతున్నారు.


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి