COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Ginger For Weight Loss In 9 Days: అల్లం శరీరానికి ఎంతో ఆరోగ్యకరమైనది. ఇందులో అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించే చాలా రకాల పోషక గుణాలు లభిస్తాయి. అంతేకాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాలు కూడా లభిస్తాయి. అందుకే చాలా మంది ఈ అల్లాన్ని ఔషధంగా కూడా వినియోగిస్తారు. దీనిని ప్రతి రోజు ఆహారంలో వినియోగించడం వల్ల వంటకాల రుచి పెరగడమే కాకుండా శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు శరీర బరువును సులభంగా తగ్గిస్తాయి. దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి. 


శీతాకాలంలో అల్లాన్ని ముఖ్యంగా జలుబు, దగ్గుకు ఇంటి నివారణగా వినియోగిస్తూ ఉంటారు. అయితే ఇది బరువు తగ్గించేందుకు కూడా సులభంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే కొన్ని ఔషధ గుణాలు కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తాయి. అయితే ప్రతి రోజు అల్లాన్ని ఎలా వినియోగించడం వల్ల సులభంగా శరీర బరువు నియంత్రణలో ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


అల్లం టీ:
సులభంగా ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు గ్రీన్‌ టీతో పాటు అల్లం టీనిని తాగాల్సి ఉంటుంది. అయితే ఈ అల్లం టీలో నిమ్మరసం కలుపుకుని తాగితే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. నిజాని అల్లం టీలో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధులను సైతం సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. 


Also Read: Happy Diwali 2023: దీపావళి రోజు లక్ష్మీ పూజలో భాగంగా తామర పువ్వులు ఎందుకు సమర్పిస్తారో తెలుసా? తప్పకుండా తెలుసుకోండి!  


అల్లం, నిమ్మకాయ నీరు:
బరువు తగ్గాలనుకునేవారు ఉదయాన్నే నిమ్మరసంలో అల్లాన్ని కలుపుకుని తాగితే సులభంగా బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను సులభంగా కరిగిస్తాయి. అంతేకాకుండా బాడీలో పేరుకుపోయి వ్యర్థ్య పదార్థాలను కూడా తొలగిస్తాయి. 


అల్లం స్మూతీ:
బరువు తగ్గడానికి అల్లం స్మూతీ కూడా ప్రభావంతంగా సహాయపడుతుంది. ఈ స్మూతీని ప్రతి రోజు తాగాలనుకునేవారు పండ్ల రసాల్లో కూడా కలుపుకుని తాగొచ్చు. ఇలా ప్రతి రోజు తాగడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా శీతాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.


Also Read: Happy Diwali 2023: దీపావళి రోజు లక్ష్మీ పూజలో భాగంగా తామర పువ్వులు ఎందుకు సమర్పిస్తారో తెలుసా? తప్పకుండా తెలుసుకోండి!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook