Ginger Side Effects For Diabetes: జలుబు, దగ్గు, ఇతర అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి అల్లాన్ని వినియోగిస్తారు. అయితే ఇందులో చాలా రకాల ఔషధ గుణాలుంటాయి. ఇది శరీరాన్ని వ్యాధుల నుంచి సంరంక్షించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అల్లం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా ప్రభావవంతంగా పని చేస్తుంది.  అయితే మధుమేహం ఇతర సమస్యలతో బాధపడుతున్నవారు ఈ అల్లాన్ని తీసుకుంటే చాలా రకాల దుష్ప్రభావాలు కలుగవచ్చని ఆరోగ్య నిపుణుల తెలుపుతున్నారు. అయితే వీరు క్రమం తప్పకుండా అల్లాన్ని తీసుకుంటే ఎలాంటి వ్యాధుల బారిన పడతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సమస్యలు రావొచ్చు..
మధుమేహంతోబాధపడే వారికి  అల్లం అతిగా తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు రావొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు ఔషధాలు వాడుతున్నవారు అస్సలు అల్లాన్ని అతిగా తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలున్నా..ఇవి మధుమేహం ఉన్నవారికి హాని కలిగించవచ్చు.


పొట్ట సమస్యలు:
మధుమేహం ఉన్నవారు అల్లం ఎక్కువగా తీసుకుంటే కడుపులో మంట వంటి సమస్యలు రావచ్చు.  అతిగా తీసుకుంటే కడుపు నొప్పి, కడుపులో మంట వంటి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. కాబట్టి వీటిని తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


చర్మ సమస్యలు:
ఇప్పటికే మధుమేహం ఉన్నవారిలో చర్మ సమస్యలుంటే అల్లం ఎక్కువగా తినకపోవడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. ఇది కొన్ని సందర్భాల్లో చర్మ సమస్యలకు దారీ తీయోచ్చు. అల్లం ఎక్కువగా తినడం వల్ల కళ్లలో వాపు, ఎరుపు, ఊపిరి ఆడకపోవడం, దురద, పెదవుల వాపు, కళ్ల దురద, గొంతు సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Halloween stampede: హీరోయిన్ దెబ్బకు 149 మంది మృతి.. వందల మంది ఆసుపత్రి పాలు!


Also Read: Varasudu Business Details: షాకిస్తున్న వారసుడు బిజినెస్ డీటైల్స్.. ఎన్ని కోట్లకు అమ్మారంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook