Glue Berry: గ్లూబెర్రీ పండ్లు వందల సమస్యలకు ఔషధం.!
Glue Berry Health Benefits: గ్లూబెర్రీ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానిక ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే దీని వల్ల కలిగే ప్రయోజనాలు, ఆరోగ్యలాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Glue Berry Health Benefits: మన చుట్టూ పక్కల ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. అయితే కొన్ని పిచ్చి మొక్కలు కూడా ఉంటాయి. కానీ ఈ మొక్కల వల్ల కొన్ని ప్రయో జనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అందులో ఈ నక్కెర పండ్ల ఒకటి. ఈ పండుతో కొందరు ఊరగాయలు, కూరలు తయారు చేస్తారు. ఇవి ఎంతో రుచికరంగా ఉంటాయి. అయితు ఈ పండు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుంది అనేది మనం తెలుసుకుందాం.
నక్కెర పండులో బోలెడు పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా కాల్షియం, ఫైబర్, ప్రోటీన్, క్రూడ్ ఫైబర్, కార్బోహైడ్రేట్, కొవ్వు, ఫాస్పరస్ ఉంటాయి. దీంతో పాటు యాంటీ ఇన్‌ఫ్లమెంటరీ లక్షణాలు ఉంటాయి. ఈ పండు నాలుగు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ పండు విరిగి చెట్టుకు కాస్తాయి. ఈ పండు చూడడానికి పచ్చి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అలాగే ఎరుపు రంగులో ఉంటాయి. ఈ కాయలను పెద్దలు, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ కాయలను తీసుకోవడం వల్ల డయాబెటిస్ వారికి ఎంతో మేలు కలుగుతుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటుంది. ఈ పండు రక్తంలోని గ్లూకోస్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా ఈ పండు మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ వంటి ఇతర సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
అంతేకాకుండా ఈ పండు వర్షాకాలంలో కలిగే చర్మ సమస్యలను కూడా తొలగిస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో వచ్చే దగ్గు, జలుబు, గొంతునొప్పి సమస్యలను తగ్గిస్తుంది. కొంతమందిలో దురద, అలర్జీ సమస్యలు కలుగుతాయి. అలాంటి సమయంలో ఈ పండు ఆకులను తీసుకొని దురద ఉన్నచోటు పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. గొంతు నొప్పి సమస్యలు ఉన్నవారు ఈ చెట్టు బెరడు కషాయం తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. దీని కోసం మీరు బెరుడు, నీటిలో వేసి మరిగించి దీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా మహిళల్లో కలిగే పీరియడ్స్ నొప్పి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. చిగుళ్ళు సమస్య ఉన్నవారు కూడా ఈ బెరడు మొక్కలను తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు పొందవచ్చు.
నోటి దుర్వాసన సమస్యలతో బాధపడేవారికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఆర్థరైటిస్ తో బాధపడే వారు కూడా గ్లూబెర్రీ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. కీళ్ల నొప్పులతో బాధపడేవారు దీని తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు కూడా ఈ కషాయని తీసుకోవడం వల్ల ఎన్నోలాభాలు కలుగుతాయి. జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటుంది. తలనొప్పి సమస్యలతో బాధపడేవారు కూడా ఈ పండు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ విధంగా ఎన్నో సమస్యల బారిన పడకుండా ఉంటాము.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి