Green Peas Health Benefits: పచ్చి బఠాణిలు డైట్‌లో చేర్చుకోవడం ఎంతో ముఖ్యగా. ఈ సీజన్‌లో ప్రతి ఒక్కరూ తినాల్సిందే. చిన్నా పెద్దా అందరూ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పచ్చి బఠాణీలు మార్కెట్‌లో రెండు విధాలుగా అందుబాటులో ఉంటాయి. పచ్చివి, కొన్ని ఫ్రోజెన్‌ చేసిన బఠాణీలు కూడా దొరుకుతాయి. వీటి ఎక్స్‌పైరీ ఎక్కువ రోజులు ఉంటుంది. కాబట్టి మనం పచ్చి బఠాణీలు తెచ్చి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు. ఈ బఠాణీల వల్ల కలిగే ఐదు ప్రయోజనాలు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పచ్చి బఠానీలను డైట్‌లో చేర్చుకోవాలంటే సూప్స్‌ రూపంలో తీసుకోవచ్చు. లేదా స్నాక్‌ రూపంలో తీసుకోవచ్చు. ఉడకబెట్టి ఛాట్‌ మాదిరి తీసుకుంటే కూడా రుచి అదిరిపోతుంది. అంతేకాదు అన్నం ఉడికించేటప్పుడు యాడ్‌ చేసిన సరిపోతుంది. పాస్తా వంటివి తయారు చేసుకున్నప్పుడు కూడా పచ్చి బఠానీలు వేసుకోవాలి. 


కంటి ఆరోగ్యం..
పచ్చి బఠాణీల్లో జియాంథీన్‌, లూటీన్‌ ఉంటుంది. ఇందులో కెరొటనాయిడ్స్‌ కూడా ఉంటాయి. ఇవి ఆక్సిడేటీవ్‌ డ్యామేజ్‌ కాకుండా హానికర యూవీ కిరణాల నుంచి కంటిని కాపాడుతుంది. దీంతో వయస్సు రీత్యా వచ్చే కంటి సమస్యలకు చెక్‌  పెట్టొచ్చు. పచ్చి బఠాణీలు ఆరోగ్యకరం. మీ పిల్లల లంచ్‌ బాక్స్‌లో కూడా గ్రీన్‌ పీస్‌ పెట్టండి. 


గుండె ఆరోగ్యం..
పచ్చి బఠానీలు డైట్‌లో ఉంటే గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్‌లు ఉంటాయి. ఇవి మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను సైతం బయటకు తరిమేస్తాయి. దీంతో కార్డియో వ్యవస్థ ఏ ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా పనిచేస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేసి ఆక్సిడేటీవ్‌ డ్యామేజ్‌ కాకుండా నివారిస్తుంది. 


బరువు నిర్వహణ..
పచ్చి బఠానీలలో యాంటీ ఆక్సిడెంట్లు, పొటా షియం ఉంటుంది. దీంతోపాటు బఠాణీల్లో కేలరీలు కూడా తక్కువ మోతాదులో ఉంటాయి. ప్రొటీన్‌, ఫైబర్‌ కూడా పుష్కలం కాబట్టి ఇవి తింటే కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సమయం పాటు కలుగుతుంది. అతిగా తినకుండా ఉంటారు. బరువు కూడా పెరగరు.


ఇదీ చదవండి: జియో బంపర్‌ ప్లాన్ రూ.200.. మైండ్‌ బ్లోయింగ్‌ 3 రీఛార్జీ ప్యాక్‌లు, ఆఫర్‌ వివరాలు..


పేగు ఆరోగ్యం..
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం పచ్చి బఠానీల్లో ఫైబర్‌ పుష్కలం. ఇందులో ఉండే డైటరీ ఫైబర్‌ కడుపును ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ సమస్యలు దరిచేరకుండా ఉంచుతుంది. మొత్తంగా పేగు కదలికలు పచ్చి బఠాణీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కడుపు సంబంధిత సమస్యలకు సులభంగా చెక్‌ పెట్టొచ్చు.


ఇమ్యూనిటీ..
పచ్చి బఠానీ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్‌ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సీ ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. అంతేకాదు పచ్చి బఠానీల్లో విటమిన్‌ ఏ ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి రోజూ చిన్నా పెద్దా తేడా లేకుండా డైట్‌లో చేర్చుకోవచ్చు. కానీ, ఏవైనా అతిగా తింటే విషం. పచ్చి బఠానీలు అతిగా తినడం వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి. 


ఇదీ చదవండి: నానబెట్టిన అంజీర్‌తో షుగర్‌ వ్యాధిగ్రస్థులకు నమ్మలేని 5 ఆరోగ్య ప్రయోజనాలు..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.