Green Tea Benefits: రోజూ గ్రీన్ టీ తాగితే కలిగే లాభాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే
Green Tea Benefits: గ్రీన్ టీ. ఇదొక అద్భుతమైన హెల్త్ డ్రింక్. రోజూ పరగడుపున తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకురుతాయి. అటు బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. ఇటు మెదడు పనితీరు వేగవంతమౌతుంది.
ఇండియాలో టీ ప్రేమికులు చాలా ఎక్కువ. కానీ ఆరోగ్యపరంగా అంత మంచిది కాదు. దీనికి ప్రత్యామ్నాయమే గ్రీన్ టీ. గ్రీన్ టీతో రోజు ప్రారంభిస్తే..రోజంతా ఆరోగ్యంగా, ఫ్రెష్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. రోజూ ఉదయం పరగడుపు తాగితే నిజంగా ఓ హెల్త్ డ్రింక్‌లా పనిచేస్తుంది. దీనివల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉండటమే కాకుండా..మెదడు పనితీరు వేగవంతమౌతుంది.
గ్రీన్ టీ ఉపయోగాలు
అధిక బరువుకు చెక్
బరువు అంతకంతకూ పెరిగిపోతుంటా రోజూ ఉదయం పరగడుపున గ్రీన్ టీ తాగడం ప్రారంభిస్తే మంచి ఫలితాలుంటాయి. ఓ నెల విరామం లేకుండా తాగితే పొట్ట చుట్టూ ఉండే కొవ్వు వేగంగా కరుగుతుంది. దాంతోపాటు ఇమ్యూనిటీ పెరుగుతుంది. రోజంతా ఫ్రెష్‌గా , ఎనర్జిటిక్‌గా ఉంటారు.
మెదడు పనితీరు వేగవంత
రోజూ పరగడుపున గ్రీన్ టీ తాగడం వల్ల మీ మెదడు పనితీరు వేగవంతమౌతుంది. దీంతో ఏ పనైనా వేగంగా, సరైన పద్ధతిలో చేయగలరు. దాంతోపాటు మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది. న్యూరో సమస్యలతో ఇబ్బందిపడేవారికి గ్రీన్ టీ అద్భుతమైన డ్రింక్.
బ్లడ్ షుగర్ నియంత్రణ
రోజుకు కనీసం 2-3 సార్లు గ్రీన్ టీ తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు. దాంతోపాటు బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ సమస్య దూరమౌతుంది.
ఎముకలకు పటిష్టత
రోజూ ఉదయం పరగడుపున గ్రీన్ టీ తాగడం వల్ల ఎముకలకు బలం కలుగుతుంది. దీంతో ఓస్టియోపోరోసిస్, ఓస్టియోపేనియా వంటి వ్యాధుల్నించి ఉపశమనం పొందవచ్చు.
Also read: Anti Ageing Tips: వయస్సుకు ముందే వృద్ధాప్యమా, ఈ చిట్కాలు పాటిస్తే వెంటనే మాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link- https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook