Guava Juice Benefits: ఈ రసం తాగితే దీర్ఘకాలిక వ్యాధులన్నీ దూరం..
Guava Juice Benefits: ప్రతి రోజు జామకాయ రసం తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా పొట్ట సమస్యలు కూడా దూరమవుతాయి.
Guava Juice Benefits: ప్రతి రోజు జామకాయ రసం తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. దీంతో పాటు జామకాయలో ఉండే పోషకాలు శరీరానికి తగిన మోతాదులో అందుతాయి. అంతేకాకుండా ఇది శరీరంలోని రోగనిరోధక శక్తి పెంచేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఇది జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా ఇతర లాభాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
జామకాయ రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
జామకాయ రసంలో విటమిన్ సి కూడా అధికంగా లభిస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతోపాటు జలుబు, ఫ్లూ వంటి అంటువ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటానికి కీలక పాత్ర పోషిస్తుంది.
జీర్ణక్రియ మెరుగుపరచడానికి:
జామకాయ రసంలో ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
గుండె ఆరోగ్యం కోసం:
జామకాయ రసంలో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. దీంతో పాటు గుండెపోటును నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
బరువు తగ్గడానికి..:
జామకాయ రసంలో తక్కువ కేలరీలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఆకలిని నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా అతిగా తినడాన్ని కూడా నివారిస్తుంది.
క్యాన్సర్‌తో పోరాడటానికి..:
జామకాయ రసంలో యాంటీఆక్సిడెంట్ల ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
చర్మ ఆరోగ్యం కోసం:
ఈ రసంలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి, చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ రసం తాగడం వల్ల మచ్చలు కూడా సులభంగా తగ్గుతాయి.
రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది:
జామకాయ రసం డయాబెటిస్ ఉన్నవారు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో లభించే సహజ చెక్కర అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించేందుకు సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి