Guava Leaves Benefits: పిప్పి పన్ను, పొట్ట సమస్యలు, బెల్లీ ఫ్యాట్ & డయాబెటీస్.. అన్నిటికి తగ్గించే జామాకులు
Guava Leaves help you Loss Weight: ప్రతి రోజు జామ ఆకులతో తయారు చేసిన రసాన్ని ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
Health Benefits Guava Leaves: జామ పండ్లు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ప్రస్తుతం ఈ పండ్లు మార్కెట్‌లో తెలుపు, ఎరుపు రెండు రకాలుగా లభిస్తున్నాయి. ఇవి ప్రతి రోజు తినడం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు తీవ్ర వ్యాధులు రాకుండా కూడా శరీరాన్ని రక్షిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే జామ పండ్లే కాకుండా శరీరానికి వీటి ఆకులు కూడా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇందులో కూడా శరీరానికి కావాల్సిన చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. ఈ ఆకుల వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
జామ ఆకులలో లభించే పోషకాలు:
జామ ఆకుల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో క్యాల్షియం, పొటాషియం, సల్ఫర్, సోడియం, ఐరన్, బోరాన్, మెగ్నీషియంతో పాటు మాంగనీస్, విటమిన్ బి, విటమిన్ సి కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పచ్చి ఆకులను నమిలి తినాల్సి ఉంటుంది.
జామ ఆకులను తినడం వల్ల కలిగే లాభాలు:
✺ ప్రతి రోజు జామ ఆకులను తినడం పిప్పి పన్ను సమస్యల నుంచి సులుభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు తీవ్ర దంతాల సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తాయి.
✺ జామ ఆకులలో కేలరీలు చాలా తక్కువగా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఈ ఆకులను తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు తగ్గుతాయి. అంతేకాకుండా శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
✺ తరచుగా పొట్ట సమస్యలతో బాధపడేవారు జామ ఆకులతో నుంచి తీసిన రసాన్ని ప్రతి రోజు తాగాల్సి ఉంటుంది. ఈ జ్యూస్‌ను తగడం వల్ల అతిసారం, గ్యాస్, తీవ్ర పొట్ట నొప్పి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
✺ బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించేందుకు కూడా జామ ఆకుల రసం సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు చాలా శరీరంలోని పొట్ట భాగంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.
✺ మధుమేహంతో బాధపడేవారు ప్రతి రోజు ఈ ఆకుల నుంచి తయారు చేసిన రసాన్ని తాగడం వల్ల సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, నిపుణుల సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook