H3n2 Virus Treatment: కరోనా వైరస్ నుంచి ఉపశమనం పొందక ముందే మరో సారి కోరలు చాస్తోంది. కోవిడ్‌తో పాటు కొత్త  వైరస్ ఇన్‌ఫ్లుఎంజా H3N2 (H3N2 ఇన్‌ఫ్లుఎంజా వైరస్) మళ్లీ ఆందోళనలు రేపుతోంది. కర్ణాటకలోని హాసన్‌కు చెందిన 82 ఏళ్ల వృద్ధుడు ఈ వేరియంట్‌తో మృతి చెందడం వల్ల.. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అంతేకాకుండా హర్యానాలో కూడా ఒకరు మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే కేంద్ర ప్రభుత్వం వివరాల ప్రకారం కర్ణాటక, పంజాబ్, హర్యానాతో కలిపి దేశవ్యాప్తంగా 6 మంది మరణించారని పేర్కొంది. అయితే ఈ వేరియంట్‌ వల్ల అప్రమత్తం కావాల్సిన అవసరం లేదని పలు డ్రగ్స్‌ తీసుకోవడం వల్ల కూడా సులభంగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల H3N2 ఇన్‌ఫ్లుఎంజా వైరస్ నుంచి ఉపశమనం పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లూ వ్యాక్సిన్‌ తీసుకోవడం ద్వారా వైరస్‌ను సులభంగా అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. వాతావరణం మారినప్పుడు ఫ్లూ కేసులు ఖచ్చితంగా పెరుగుతాయని కాబట్టి ఇలా కేసులు పెరిగి తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా  జలుబు-దగ్గు, జ్వరంతో బాధపడుతున్న రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో హెచ్‌3ఎన్‌2 కారణంగా ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య కూడా పెరిగుతుంది.  కరోనా, ఈ వైరస్ మధ్య తేడాను గుర్తించడం చాలా కష్టం..67 రోజుల తరువాత కరోనా యొక్క క్రియాశీల కేసులు 3 వేలకు పైగా పెరిగాయి. కోవిడ్ కేసుల ఆకస్మిక పెరుగుదలతో పాటు, H3N2 వైరస్ కేసులు కూడా పెరగడం ఆందోళన కలిగిస్తుంది.


H3N2 ఇన్ఫ్లుఎంజా వైరస్ అంటే ఏమిటి?
ఇన్ఫ్లుఎంజా వైరస్ శ్వాసకోశ సంక్రమణకు కారణంగా వస్తున్న వైరస్‌.. ఈ వైరస్ పక్షులు, జంతువులకు కూడా సోకుతుంది. అంతేకాకుండా ఈ వైరస్‌ పక్షులు, ఇతర జంతువులతో పాటు మనుషులకు సంక్రమించిన వ్యాధి. H3N2 వైరస్ అనేది ఇన్ఫ్లుఎంజా-A వైరస్ ఉప రకం. ఇలాంటి వైరస్‌ సోకిన వారిలో పలు లక్షణాలు ఉత్పన్నమవుతాయి. అయితే ఇలాంటి లక్షణాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.


H3N2 ఇన్ఫ్లుఎంజా వైరస్ లక్షణాలు:
జ్వరం నుంచి తీవ్రమైన న్యుమోనియా
అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్
ముక్కు కారడం, అధిక జ్వరం
దగ్గు
గొంతు నొప్పి, అలసట


ఎలా రక్షించుకోవాలి?
తప్పకుండా మాస్క్ ధరించి.. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లవద్దు.
కరచాలనం చేయడం మానుకోండి.
గుంపు ప్రదేశాల్లో కూర్చొని భోజనం చేయకపోవడం చాలా మంచిది.
కళ్ళు, ముక్కును పదేపదే తాకడం మానుకోండి.
జ్వరం ఉంటే వైద్యుడిని సంప్రదించండి.


Also Read: Ind Vs Aus: సేఫ్ జోన్‌లో ఆసీస్.. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు.. భారత్ గెలవాలంటే..!  


Also Read: MP Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన విషయాలు.. మొత్తం బయటపెట్టిన అవినాష్ రెడ్డి 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి