Hair Fall Remedies: జుట్టు రాలడాన్ని నియంత్రించే మూడు ఇంటి చిట్కాలు!
Home Remedies For Hair Fall: జుట్టు రాలడమనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య. చిన్నా, పెద్ద వయసు తేడా లేకుండా నలుగురులో ముగ్గురు ఈ సమస్యతో బాధపడుతున్నారు. కానీ, జట్టు రాలడాన్ని కొన్ని ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వల్ల తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Home Remedies For Hair Fall: జుట్టు రాలే సమస్య ఇప్పుడు వయసు మళ్లిన వారికే కాకుండా.. యువతలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. మారుతున్న జీవన శైలీ, అనారోగ్యకరమైన ఆహారం, వాతావరణ మార్పులు, కాలుష్యం, రసయనాలు అధికంగా ఉండే తత్పత్తులను తలకు ఉపయోగించడం వల్ల జుట్టు రాలడానికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అయితే జుట్టుకు సరైన పోషకాహారం లేదా జుట్టుకు సంరక్షణ లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. జుట్టు రాలే సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకునేందుకు జుట్టుకు సరైన పోషణ అందాలి.
అయితే వెంట్రుకలకు పోషణను అందజేసే 3 రకాల హెయిర్ మాస్క్ లను ఉపయోగిస్తే మంచిది. వీటిని తలకు అప్లే చేయడం వల్ల జుట్టును శుభ్రపరుస్తాయి. అయితే జుట్టు ఏఏ మాస్క్ లు ఉపయోగించడం వల్ల జుట్టు రాలే సమస్య పరిష్కారం లభిస్తుందో తెలుసుకుందాం.
జుట్టు పోషణకు అవసరమైన మూడు హెయిర్ మాస్క్ లు
1. ఎగ్ మాస్క్
ఎగ్ మాస్క్ జుట్టు సమస్యలపై కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. గుడ్డులో ఒక చెంచా ఆలివ్ ఆయిల్, తేనె కలిపి మాస్క్‌ను తయారు చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని తలకు పట్టించిన అరగంట తర్వాత దాన్ని కడిగేయాలి. అలా చేసిన కొన్ని రోజుల్లోనే జుట్టు రాలే సమస్య గణనీయంగా తగ్గిపోతుంది.
2. అలోవెరా హెయిర్ మాస్క్
అలోవెరా మాస్క్ మీ జుట్టు రాలకుండా నిరోధించడమే కాకుండా చుండ్రు సమస్యను దూరం చేస్తుంది. కలబంద జెల్‌ను నేరుగా మీ జుట్టుకు అప్లై చేసి, 20 నిమిషాల పాటు ఉంచిన తర్వాత కడిగేయండి. ఇలా 3 వారాలలో 3 సార్లు అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
3. మెంతి మాస్క్
మెంతి మాస్క్ మీ జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ మిశ్రమాన్ని సిద్ధం చేసేందుకు రాత్రి రెండు చెంచాల మెంతులు నానబెట్టాలి. ఉదయాన్నే దాన్ని పేస్ట్ గా మార్చి.. తలపై రాసుకోవాలి. ఆ తర్వాత దాన్ని చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా కొన్ని రోజుల్లోనే జుట్టు రాలే సమస్యకు స్వస్తి పలకవచ్చు.
(నోట్: పైన పేర్కొన్న సమాచారం కొందరు నిపుణులు చెప్పిన సూచనలు మేరకు అందించబడింది. వాటిని పాటించే ముందు వైద్యుడ్ని సంప్రదించడం మంచిది. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరించడం లేదు.)
Also Read: Anti Ageing Juice: ఈ పండ్ల రసాలు తాగడం వల్ల ఎప్పటికీ యవ్వనంగా కనిపిస్తారు!
Also Read: Black Grapes Benefits: నల్ల ద్రాక్ష తినడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.