Hand Shivering Exercise: మాట్లాడేప్పుడు లేదా ఏదైనా పని చేసేప్పుడు చాలా మందికి చేతులు వణుకుతున్నట్లు మీరు గమనించే ఉంటారు. ఇలాంటి సమస్యలు మారుతున్న జీవనశైలి, అధిక ఒత్తిడి, ఆహారపు అలవాట్ల వల్ల యువతలోనూ వస్తుంటాయి. అయితే చేతులు ఎందుకు వణుకుతాయనే దానికి మాత్రం సరైన కారణం ఇంకా వెల్లడి కాలేదు. కానీ, శరీరంలోని కొన్ని నాడుల పనితీరు కారణంగానూ ఈ సమస్య ఎదురుకావొచ్చని కొందరు వైద్యులు అంటున్నారు. అయితే చేతుల్లో వణుకును తగ్గించుకునేందుకు కొన్ని వ్యాయామాలు చేస్తే సరి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రబ్బరు బంతితో వ్యాయామం


రబ్బర్ లేదా స్పాంజ్ బాల్ వ్యాయామం వల్ల చేతి వణుకు సమస్య నుంచి బయటపడవచ్చు. చేతులు వణుకడాన్ని నియంత్రించడంలో ఈ వ్యాయామం చాలా ఉపయోగకరంగా ఉంటుందని వైద్యులు నమ్ముతారు. ఎందుకంటే బంతిని నొక్కడం వల్ల నరాల పనితీరు మెరుగవుతుందని వారి నమ్మకం. బంతిని వీలైనంత గట్టిగా ఒత్తడం సహా గట్టిగా పిసికేసే విధంగా ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీలో చేతులు వణికే సమస్య తగ్గుముఖం పడుతుంది. 


డంబెల్ వ్యాయామం


హ్యాండ్ డంబెల్ వ్యాయామం కూడా ఈ సమస్య నుంటి బయట పడేందుకు మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వ్యాయామం చేతుల్లోని వణుకు తగ్గేందుకు అవకాశం ఉంది. ఈ వ్యాయామం పార్కిన్సన్స్ రోగులు కూడా చేస్తారు. ఎందుకంటే ఇది నరాల అలసట, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.


ఫింగర్ ట్యాప్ వ్యాయామం


ఫింగర్ ట్యాప్ వ్యాయామంతో మీకు ఉపశమనం లభిస్తుంది. ఈ వ్యాయామం ద్వారా మీ చేతి వేళ్లు కదలికలను నియంత్రించాలి. ఫింగర్ ట్యాప్ వ్యాయామం అనేది ఒక సాధారణ వ్యాయామం.. ఇది మీ చేతి వేళ్ల కదలికపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన విషయం. 


(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా కొన్ని నివేదికల నుంచి గ్రహించబడింది. దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్య నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.) 


Also Read: Heart Attack Risk: రోజూ సరిగా బ్రష్ చేసుకోకపోతే గుండె జబ్బులు రావడం ఖాయం!


Also Read: Watermelon Benefits: పుచ్చకాయ తినడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.