Diwali Healthy Gifts: దీపావళి వచ్చిందంటే చాలు బంధుమిత్రులకు తాహతును బట్టి బహుమతులు ఇచ్చుకుంటారు. చాలామంది స్వీట్స్ పంచుకుంటారు. లేదా ఫ్యాన్సీ బహుమతులు అందించుకుంటారు. అయితే ఇలాంటి గిఫ్ట్స్ ఇచ్చే కంటే హెల్తీ గిఫ్ట్స్ ఇచ్చుకోవడం మంచిది. మీక్కావల్సినవారి ఆరోగ్యాన్ని సంరక్షించవచ్చు. దీనికోసం డ్రై ఫ్రూట్స్ బెస్ట్ ఆప్షన్. ఇందులో ఉండే ప్రోటీన్లు, ఫైబర్ వంటి పోషకాలు ఆరోగ్యాన్ని సదా సంరక్షిస్తాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాదం..ప్రోటీన్లకు బాదం బెస్ట్ ఆప్షన్. 100 గ్రాముల బాదం తీసుకుంటే 21 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ప్రోటీన్లతో పాటు విటమిన్ ఇ, మెగ్నీషియం, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. రోజూ క్రమం తప్పకుండా నిర్ణీత మోతాదులో బాదం తింటే యాంటీ ఆక్సిడెంట్లు పెరగడం వల్ల సెల్స్ ఆరోగ్యంగా ఉంటాయి. ఇక రెండవది హేజిల్ నట్స్. ఇవి కూడా ప్రోటీన్లకు బెస్ట్ సోర్స్. 100 గ్రాముల హేజిల్ నట్స్ తీసుకుంటే అందులో 15 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. ఇందులో విటమిన్ ఇ, ఫోలిక్ యాసిడ్, హెల్తీ ఫ్యాట్ పెద్దఎత్తున ఉంటాయి. హేజిల్ నట్స్ తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు ఉత్పన్నం కావు. శరీరంలో కొలెస్ట్రాల్ సైతం నియంత్రణలో ఉంటుంది. 


జీడిపప్పులో ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల జీడిపప్పు తీసుకుంటే అందులో 18 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. జీడిపప్పులో కాపర్, మెగ్నీషియంతో పాటు ఫైటో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఎముకల్ని పటిష్టం చేయడమే కాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. మొత్తానికి ఇమ్యూనిటీ పెరుగుతుంది. వాల్‌నట్స్ మరో అద్భుతమైంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పెద్దమొత్తంలో ఉంటాయి. 100 గ్రాముల వాల్‌నట్స్‌లో దాదాపు 15 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. గుండె ఆరోగ్యానికి వాల్‌నట్స్ చాలా బాగా పనిచేస్తాయి. వాల్‌నట్స్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చాలా ఎక్కువ. 


ఇక మరో బెస్ట్ డ్రై ఫ్రూట్ పిస్తా. 100 గ్రాముల పిస్తా తీసుకుంటే ఇందులో 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దాంతోపాటు ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఫలితంగా కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటాయి. శరీరం మెటబోలిజం వేగవంతమౌతుంది. 


Also read: Mercury Transit 2024: బుధ గోచారం ప్రభావం నవంబర్ 1 నుంచి ఈ 3 రాశులకు అంతా డబ్బే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.