Benefits of Hair oil : ప్రస్తుతం తరం వారికి చాలా ఇబ్బందికరమైన పని ఏదైనా ఒకటి ఉంది అంటే అది జుట్టుకు నూనె పెట్టుకోవడమే. ఎందుకంటే జుట్టుకు నూనె పెట్టుకుని చక్కని ఏదన్నా పని పడితే బయటకి వెళ్లలేము అని ఎంతోమంది అమ్మాయిలు చెప్పడం మనం తరచుగా వింటూ ఉంటాం. నూనె పట్టుకొని బయటకు వెళ్ళదాన్ని అది ఏదో నచ్చని పని లాగా చూస్తూ ఉంటారు నేటి తరం యువత.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా నేటి తరం యువతలో ఉన్న పెద్ద ప్రశ్న ఒకటి ఏమిటి అంటే నిజంగా తలకి నూనె అవసరమా? మరి దీనికి సమాధానం కావాలంటే ఇది ఒకసారి చదివేయండి.


మన శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో తలకు నూనె కూడా అంతే ముఖ్యం. తలకు నిత్యం నూనె రాసుకోవాలని ఆయుర్వేదం చెబుతుంది. పూర్వం నుండి మన పెద్దలు తలకు నూనె రాసుకోమని సూచిస్తుంటారు. ఎందుకంటే తలకు నూనె పెట్టుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా కనీసం మారాలికి రెండుసార్లు అయినా తలకి నూనెతో మసాజ్ చేస్తే రక్తప్రసరణ బాగా జరుగుతుంది. అంతేకాకుండా జుట్టుకు బలం చేకూరుతుంది. దీని వల్ల తెల్ల జుట్టు త్వరగా రాదు. అలానే జుట్టు రాలడం, చుండ్రు వంటి అనేక రకాల సమస్యలకు దూరంగా ఉండొచ్చు.


ఒకవేళ జుట్టు పొడిగా ఉండి చిట్లి పోతుంటే వారానికి మూడుసార్లు జుట్టుకు నూనె రాయడం జుట్టుకు బలం చేకూరుతుంది. అంతేకాదు తరచుగా జుట్టుకి నూనె రాస్తూ ఉంటే జుట్టు పొడిబారకుండా ఉండి జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. 


కొంతమంది బయట స్కూటీలో వెళితే తమ జుట్టు రేగిపోయి చిట్లిపోతా ఉంది అంటూ చెబుతూ ఇలా కాకుండా ఉండడానికి ఎన్నో కండిషనర్లు వాడుతారు. కానీ అవేవీ అవసరం లేదు వారానికి మూడుసార్లు నూనె పెట్టుకుంటే జుట్టు చెట్ల కింద ఎల్లప్పుడూ మెరుస్తూ, ఒత్తుగా కనిపించేలా చేస్తుంది.


నూనెల్లో కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి ఉంటాయి. జుట్టు ఆరోగ్యంగా కనిపించేలా చేయడంలో లిపిడ్‌లు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందుకే నేను పెట్టుకోవడం వల్ల అవి జుట్టులోని లిపిడ్లను భర్తీ చేయడంలో సహాయపడతాయి. ఫలితంగా జుట్టు అందంగా ఉంటుంది. 


కాబట్టి మీరు మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే.. ప్రతిరోజూ నూనెను తప్పక రాయాలి. రోజు రాసుకోవటం కుదరకపోతే కనీసం వారానికి రెండుసార్లు లేదా మూడుసార్లు మీతో మసాజ్ చేసుకోవడం మంచిది.


Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంటే


Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి