Green Tea: గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలామంది తరచూ గ్రీన్ టీ తాగుతుంటారు. గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. కానీ తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవల్సిందేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. లేనిపక్షంలో పలు సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రీన్ టీ అంటే వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలకు కేరాఫ్‌గా చెప్పవచ్చు. అందుకే ఎక్కువమంది వైద్యులు గ్రీన్ టీ తీసుకోమనే సూచనలిస్తుంటారు. అయితే గ్రీన్ టీతో ప్రయోజనాలతో పాటు హాని కూడా ఉందనే విషయం చాలామందికి తెలియదు. అంటే గ్రీన్ టీను ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదు. గ్రీన్ టీ విషయంలో ఉన్న ఆంక్షలేంటో తెలుసుకుందాం..


బరువు తగ్గించేందుకు


గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరం మెటబోలిజంను వృద్ధి చేస్తాయి. గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలో క్రమక్రమంగా కొవ్వు కరుగుతుంటుంది. రోజువారీ వ్యాయామం కంటే ముందు తీసుకోవడం మంచిది.


గ్రీన్ టీ ఎప్పుడు తాగాలి, ఏది సరైన సమయం


చాలామంది భోజనం చేసిన గంట తరువాత గ్రీన్ టీ తాగడాన్ని ఇష్టపడుతుంటారు. గ్రీన్ టీలో ఉండే ట్యానిన్ వల్ల కడుపులో మంట, మలబద్ధకం, కడుపు నొప్పి సమస్య ఉత్పన్నమౌతుంది. గ్రీన్ టీని ఎన్నడూ పరగడుపున తీసుకోకూడదు. ఒకరోజుకు 3 కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీ తాగితే ఆరోగ్యానికి హాని చేకూరుతుంది. పడుకునే ముందు తాగితే డీ హ్రైడేషన్ సమస్య తలెత్తవచ్చు.


కేన్సర్ నుంచి విముక్తి


కేన్సర్ అనేది అత్యంత గంభీరమైన వ్యాధి. ఇంతటి సీరియస్ వ్యాధిని కూడా గ్రీన్ టీతో తగ్గించవచ్చు. ఇందులో ఉండే పోలీఫెనాల్స్..ట్యూమర్, కేన్సర్ కణాల్ని నియంత్రించడంలో దోహదపడతాయి. ప్రత్యేకించి ప్రోస్టేట్, బ్లెస్ట్ కేన్సర్‌కు ఉపయోగపడుతుంది.


కొలెస్ట్రాల్ నియంత్రణ


గ్రీన్ టీ తాగడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం తగ్గుతుంది. దీనివల్ల బ్లడ్ సెల్స్‌లో బ్లాకేజ్‌లు ఉంటే తగ్గిపోతాయి. అందుకే గుండెపోటు వ్యాధుల ముప్పు చాలావరకూ తగ్గుతుంది.


స్కిన్ ఇన్‌ఫెక్షన్


చర్మ పరిరక్షణలో గ్రీన్ టీ అద్బుతంగా ఉపయోగపడుతుంది. చర్మం దెబ్బతిన్నప్పుడు, చర్మ కణాల పునర్నిర్మాణంలో గ్రీన్ ఉపయోగం ఎక్కువే. ఇందులో స్కిన్ ఇన్‌ఫెక్షన్ నుంచి రక్షించే గుణాలు ఎక్కువ. స్వెల్లింగ్ సమస్య తగ్గుతుంది. చర్మంపై పింపుల్స్ ఉంటే తగ్గిపోతాయి.


Also read: Summer Drinks: వేసవి దాహం తాపాన్ని తీర్చే అద్భుతమైన డ్రింక్స్ ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook