Ginger and jaggery Tea: టీ లేదా కాఫీ తాగనివారు చాలా తక్కువే. ఇండియాలో అయితే టీ ప్రేమికులే ఎక్కువ. టీలో పంచదార కాకుండా..అది కలుపుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీ తాగని వాళ్లు, టీ అంటే ఇష్టం లేనివాళ్లు చాలా తక్కువ. ముఖ్యంగా ఇండియాలో. టీ అంతగా అలవాటైపోయింది. ఓ సర్వే ప్రకారం మంచినీళ్ల తరువాత అత్యధికంగా తాగేది టీనే. ఉదయం లేచినప్పట్నించి రాత్రి పడుకునేవరకూ అడపాదడపా లేదా 1-2 సార్లు లేదా 2-3 సార్లు టీ తాగుతూనే ఉంటారు. అయితే టీ అతిగా సేవించడం అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుంది. టీ ఎక్కువగా తాగడం వల్ల స్థూలకాయం, డయాబెటిస్ సమస్య పొంచి ఉంటుంది. అయితే అదే టీలో పంచదారకు బదులు బెల్లం, అల్లం కలిపి తాగితే..అద్భుతమైన దివ్యౌషధమైపోతుంది. అదే అల్లం బెల్లం టీ. ఆ ప్రయోజనాలేంటో చూద్దాం..


టీ వదల్లేకపోతుంటే మరో ప్రత్యామ్నాయముంది. టీలో సాధారణంగా అత్యధికులు కలుపుకునే పంచదార స్థానంలో బెల్లం కలుపుకుంటే దుష్పరిణామాలు అంతగా ఉండవంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. పంచాదార స్థానంలో బెల్లం కలిపి..కొద్దిగా అల్లం వేసి మరిగిస్తే టీ దివ్యౌషధమైపోతుందట. అల్లం బెల్లం టీ ఆరోగ్యానికి చాలా మంచిది. 


టీని పంచదారతో సేవించడం వల్ల బరువు పెరగడమే కాకుండా ఫ్యాట్ పెరిగిపోతుంది. అదే టీలో పంచదారకు బదులు బెల్లం, కొద్దిగా అల్లం వేసి టీ సేవిస్తే చాలా సమస్యలు తొలగిపోతాయి. కేలరీలు తక్కువగా ఉండటంతో బరువు తగ్గేందుకు దోహదమౌతుంది. మరోవైపు అల్లం కారణంగా గొంతు సంబంధిత ఇన్‌ఫెక్షన్లు దూరమౌతాయి. అల్లం బెల్లం టీతో ఆరోగ్యమే కాకుండా రుచి కూడా అద్భుతంగా మారిపోతుంది. 


టీలో బెల్లం కలపడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఫలితంగా కడుపుకు సంబంధించిన సమస్యలు దూరమౌతాయి. అటు అల్లం కూడా కడుపును క్లీన్ చేస్తుంది. బెల్లంలో ఉండే విటమిన్లు, మినరల్స్ ఆరోగ్యానికి మంచివి. ప్రస్తుత ఆహారపు అలవాట్ల కారణంగా రక్తహీనత ఎక్కువగా కన్పిస్తోంది. అంటే ఎనీమియా తరచూ సమస్యగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో అల్లం బెల్లం టీ సేవిస్తే రక్తహీనత సమస్య చాలావరకూ తొలగిపోతుంది. 


Also read : Orange Side Effects: నారింజ పళ్లు ఆరోగ్యానికి మంచివా కావా, నారింజ పళ్లు ఎవరు తినకూడదు



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook