Ginger jaggery Tea: టీ, కాఫీ ఆరోగ్యానికి ఏ మేరకు మంచిదనే విషయంపై భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే టీ విషయంలో పంచదార కాకుండా బెల్లం, అల్లంతో కాచి తాగితే అద్భుత ఔషధంగా మారుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాలో టీ ప్రేమికులు చాలా ఎక్కువ. ఓ అధ్యయనం ప్రకారం ప్రతి పదిమందిలో 6-7 మంది టీ అంటే ఇష్టపడతారని తేలింది. కానీ టీ అనేది ఆరోగ్యానికి అంత మంచిది కాదంటారు ఆరోగ్య నిపుణులు. ఈ నేపధ్యంలో టీని.. పంచదారతో కాకుండా బెల్లం, అల్లంతో కాచుకుని తాగితే మాత్రం ఆరోగ్యపరంగా చాలా మంచిదంటారు.  ఎందుకంటే పంచాదార టీ అతిగా సేవించడం అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుంది. టీ ఎక్కువగా తాగడం వల్ల స్థూలకాయం, డయాబెటిస్ సమస్య పొంచి ఉంటుంది. అయితే అదే టీలో పంచదారకు బదులు బెల్లం, అల్లం కలిపి తాగితే..అద్భుతమైన దివ్యౌషధమైపోతుంది. అదే అల్లం బెల్లం టీ. ఆ ప్రయోజనాలేంటో చూద్దాం..


టీ ఇంటే ఇష్టపడేవారికి ఓ ప్రత్యామ్నాయముంది. టీలో సాధారణంగా అత్యధికులు కలుపుకునే పంచదార స్థానంలో బెల్లం కలుపుకుంటే దుష్పరిణామాలు అంతగా ఉండవంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. పంచాదార స్థానంలో బెల్లం కలిపి..కొద్దిగా అల్లం వేసి మరిగిస్తే టీ దివ్యౌషధమైపోతుందట. అల్లం బెల్లం టీ ఆరోగ్యానికి చాలా మంచిది. 


పంచదార ఆరోగ్యానికి మంచిది కానే కాదు. అందుకే టీలో పంచదారకు బదులు బెల్లం, కొద్దిగా అల్లం వేసి టీ సేవిస్తే చాలా సమస్యలు తొలగిపోతాయి. కేలరీలు తక్కువగా ఉండటంతో బరువు తగ్గేందుకు దోహదమౌతుంది. మరోవైపు అల్లం కారణంగా గొంతు సంబంధిత ఇన్‌ఫెక్షన్లు దూరమౌతాయి. అల్లం బెల్లం టీతో ఆరోగ్యమే కాకుండా రుచి కూడా అద్భుతంగా మారిపోతుంది. 


టీలో బెల్లం కలపడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఫలితంగా కడుపుకు సంబంధించిన సమస్యలు దూరమౌతాయి. అటు అల్లం కూడా కడుపును క్లీన్ చేస్తుంది. బెల్లంలో ఉండే విటమిన్లు, మినరల్స్ ఆరోగ్యానికి మంచివి. ప్రస్తుత ఆహారపు అలవాట్ల కారణంగా రక్తహీనత ఎక్కువగా కన్పిస్తోంది. అంటే ఎనీమియా తరచూ సమస్యగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో అల్లం బెల్లం టీ సేవిస్తే రక్తహీనత సమస్య చాలావరకూ తొలగిపోతుంది.


Also read: Milk and Dry grapes: జ్ఞాపకశక్తికి అద్భుతమైన దివ్యౌషధం ఇదే, ఇలా తీసుకుంటే చాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook