Brown Rice Benefits: బ్రౌన్ రైస్‌తో స్థూలకాయం, అధిక రక్తపోటుకు పూర్తిగా చెక్
Brown Rice Benefits: మనం రోజూ తినే రైస్ కంటే బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ప్రస్తుతం అందరూ విరివిగా ఉపయోగిస్తున్నారు. బ్రౌన్ రైస్‌తో అధిక రక్తపోటు, స్థూలకాయానికి పూర్తిగా చెక్ పెట్టవచ్చని మీకు తెలుసా..
Brown Rice Benefits: మనం రోజూ తినే రైస్ కంటే బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ప్రస్తుతం అందరూ విరివిగా ఉపయోగిస్తున్నారు. బ్రౌన్ రైస్‌తో అధిక రక్తపోటు, స్థూలకాయానికి పూర్తిగా చెక్ పెట్టవచ్చని మీకు తెలుసా..
ఆధునిక జీవనశైలి కారణంగా ఎదురయ్యే సకల రోగాలకు కారణం చెడు ఆహారపు ఆలవాట్లే. అందుకే ఎక్కువ మంది బ్రౌన్ రైస్‌ను ఆశ్రయిస్తున్నారు. బ్రౌన్ రైస్ అంటే ధాన్యం తొక్కని తొలగించిన తరువాత ఉండే బియ్యమే. రంగు కాస్త బ్రౌన్ కలర్‌లో ఉండటం వల్ల బ్రౌన్ రైస్ అని పిలుస్తారు. బియ్యాన్నిపూర్తిగా ప్రోసెస్ చేయనప్పుడు ఇదే రంగులో ఉంటుంది. పూర్తిగా శుభ్రం చేస్తే తెలుపు రంగులో ఉంటుంది. ఈ బ్రౌన్ రైస్ తినడం వల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ప్రోసెస్ చేయని బియ్యం కాబట్టే..ఇందులో న్యూట్రియంట్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. బ్రౌన్ రైస్ లేదా అన్‌ప్రోసెస్డ్ రైస్ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
బ్రౌన్ రైస్ ప్రయోజనాలు, మీ గుండె పదిలం
బ్రౌన్ రైస్‌లో పుష్కలంగా లభించే పోషక పదార్ధాలు చాలా లాభదాయకంగా ఉంటాయి. ఇందులో లభించే ఫైబర్ గుండె సంబంధిత వ్యాధులు, ముప్పును తగ్గిస్తాయి. ఇందులో లిగ్నాన్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది మన శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా అధిక రక్తపోటును తగ్గిస్తాయి.
బరువు తగ్గించేందుకు
బ్రౌన్ రైస్ తినడం వల్ల మీ శరీర బరువు కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఇది రిఫైండ్ రైస్ కాదు. అదే వైట్ రైస్ లేదా ప్రోసెస్డ్ బియ్యంలో న్యూట్రియంట్లు, ఫైబర్ చాలా తక్కువగా ఉంటాయి. ఫలితంగా శరీరానికి పోషక పదార్ధాలు తక్కువగా లభిస్తాయి. అదే బ్రౌన్ రైస్ తింటే మాత్రం..పుష్కలంగా ఉండే ఫైబర్, న్యూట్రియంట్ల కారణంగా బరువు తగ్గడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
Also read: Raisins Benefits: ఎండుద్రాక్షతో మగవారి ఆ సమస్యకు చెక్, బరువు తగ్గేందుకు కూడా
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook