Diabetes Diet: రోజూ పరగడుపున గుప్పెడు గింజలు తింటే చాలు, మధుమేహం దూరం
Diabetes Diet: ప్రపంచవ్యాప్తంగా భయపెడుతున్న అతి ప్రమాదకర వ్యాధి డయాబెటిస్. ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా ప్రాణాంతకం కాగలదు. డయాబెటిస్ నియంత్రణ పూర్తిగా ఆహారపు అలవాట్లు, లైఫ్స్టైల్పైనే ఆధారపడి ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం..
Diabetes Diet: మధుమేహం వ్యాధిగ్రస్థులకు బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే రక్తంలో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. ఇది వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది. అయితే డయాబెటిస్ వ్యాధికి సరైన చికిత్స ఇప్పటికీ లేదు. కేవలం నియంత్రణ ఒక్కటే మార్గం.
మధుమేహం వ్యాధిని ఎంత సులభంగా నియంత్రించవచ్చో నిర్లక్ష్యం చేస్తే అంతే ప్రమాదకరంగా మారుతుంది. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం లేదా వాకింగ్ చేయడంతో పాటు ఆహారపు అలవాట్లను మార్చుకుంటే కచ్చితంగా మధుమేహాన్ని నియంత్రించవచ్చు. డయాబెటిస్ నియంత్రించాలంటే ప్రధానంగా శ్రద్ధ పెట్టాల్సింది ఆహారపు అలవాట్లపైనే. ప్రకృతిలో లభించే కొన్ని పదార్ధాలను డైట్ లో భాగంగా చేసుకుంటే కచ్చితంగా బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మధుమేహం నియంత్రించేందుకు వేరుశెనగ అద్బుతమైన ప్రత్యామ్నాయమంటున్నారు. రోజుకు గుప్పెడు వేరుశెనగ గింజలు తింటే మధుమేహం నియంత్రణలో ఉండటమే కాకుండా చాలా రకాల వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ల కారణంగా ఇమ్యూనిటీ పెరిగి బ్లడ్ షుగర్ నియంత్రణలో వస్తుంది. చర్మం నిగారింపు కూడా వస్తుంది.
శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే క్రమంగా ఇది గుండె వ్యాధులు, అధిక రక్తపోటు, మధుమేహంకు దారి తీస్తుంది. రోజూ వేరు శెనగ గింజల్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ చాలావరకూ తగ్గిపోతుంది. అదనపు కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుంది. దీనికోసం ప్రతిరోజూ రాత్రి కొన్ని వేరుశెనగ గింజల్ని నానబెట్టి ఉదయం తినాలి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహాన్ని నియంత్రిస్తాయి. వేరుశెనగ తింటే బరువు పెరుగుతారనేది కేవలం అపోహ మాత్రమే. వాస్తవానికి వెరుశెనగ బరువు సమస్యను తొలగిస్తుంది. శరీరానికి బలాన్నిస్తుంది.
వేరుశెనగలో పుష్కలంగా లభించే విటమిన్ బి3 మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. రోజూ వేరుశెనగ తినడం అలవాటు చేసుకుంటే మెదడు షార్ప్‌గా మారుతుంది. ఇమ్యూనిటీ పెరగడంతో పాటు చర్మానికి నిగారింపు వచ్చి చేరుతుంది. అంటే స్కిన్ కేర్‌కు వేరుశెనగ అద్భుతమైన ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో విటమిన్ ఇ, మెగ్నీషియం, జింక్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి చర్మ కాంతిని పెంచుతాయి. తరచూ ఎండల్లో తిరిగేవారికి సూర్యరశ్మిలోని అతి నీలలోహిత కిరణాల నుంచి రక్షించడంలో వేరుశెనగ గింజలు కీలకపాత్ర పోషిస్తాయి.
Also read: Belly Fat Burn Drink: ఈ డ్రింక్ రోజుకు మూడు సార్లు తాగితే 5 రోజుల్లో బెల్లీ ఫ్యాట్ మాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook