Health Benefits Of Beetroot For Hair and Skin: బీట్‌రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా లభిస్తున్నాయి. ముఖ్యంగా రక్తహీనతో బాధపడే వారికి బీట్‌రూట్ చక్కటి పరిష్కారమని భావిస్తారు. చర్మంలోని కణాలను ఉత్పత్తిచేయడంతో పాటు వేగంగా రక్త కణాలను వృద్ధి చేస్తుంది. చర్మం, వెంట్రుకలు, వీర్యకణాలు వృద్ధి.. ఇలా ఎన్నో విషయాలలో బీట్‌రూట్ దోహదం చేస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


బీట్‌రూట్ తినడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు మీకోసం(Health Benefits Of Eating Beetroot)
- బీట్‌రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. తరచుగా బీట్‌రూట్ తినడం వల్ల ఇవి మన శరీరానికి అందుతాయి.


- బీట్‌రూట్‌లో బీటా కెరాటిన్, విటమిన్ సి, విటమిన్ ఈ అధికంగా ఉంటాయి. వీటి ద్వారా మన శరీరంలో కొత్త కణాలు వేగంగా ఉత్పత్తి చెంది నూతన ఉత్తేజాన్ని పొందవచ్చు.


Also Read: Corona Vaccine: కరోనా విజేతలపై ఆసక్తికర విషయం, COVID-19 Vaccine ఒక్క డోసు ఇస్తే చాలు



- సంతానోత్పత్తి కోసం యత్నిస్తున్న వారు బీట్‌రూట్‌ కచ్చితంగా తింటారు. బీట్‌రూట్ తినడం ద్వారా వీర్యకణాలు ఎక్కువగా ఉత్పత్తి అయి సంతానోత్పత్తిలో దోహదం చేస్తుంది.


- బీట్‌రూట్ ద్వారా లభించే విటమిన్ బి6, పోలిక్ ఆమ్లం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజ లవణాలు, పోషకాలు అందుతాయి. ఇవి ప్రాణాంతక క్యాన్సర్ కణాలను కొంత మేర నాశనం చేస్తాయి. 


- బీట్‌రూట్‌ తినడం ద్వారా అందే నైట్రేట్లు మన మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. మెదడుకు తగినంత రక్త ప్రవాహాన్ని అందించడంలో దోహదం చేస్తుంది. 


- వెంట్రుకలకు బీట్‌రూట్‌ పోషణ లభిస్తుంది. కడుపులో దీర్ఘకాలిక మంట లాంటి సమస్యకు చెక్ పెడుతుంది.


Also Read: Health Tips: ప్రతిరోజు ఉదయాన్నే Hot Water తాగుతున్నారా, ఈ ప్రయోజనాలు తెలుసుకోండి 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook