Black Coffee Health Benefits: బ్లాక్ కాఫీతో శరీరానికి కలిగే లాభాలు
Health Benefits of Black Coffee: బ్లాక్ కాఫీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బ్లాక్ కాఫీలో ఉండే కెఫైన్ శరీరానికి కొన్ని రకాల మేలు చేస్తాయి అనే విషయం తెలిసిందే. అందులో కొన్ని లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Health Benefits of Black Coffee: బ్లాక్ కాఫీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బ్లాక్ కాఫీలో ఉండే కెఫైన్ శరీరానికి కొన్ని రకాల మేలు చేస్తాయి అనే విషయం తెలిసిందే. అందులో కొన్ని లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్లాక్ కాఫీ తాగితే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం నుంచి రక్షిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ సమస్యని నివారించడమే కాకుండా ఇప్పటికే డయాబెటిక్ సమస్యలతో బాధపడుతున్న వారిలో మధుమేహం రిస్కుని తగ్గిస్తుంది అని పలు పరిశోధనలు చెబుతున్నాయి.
బ్లాక్ కాఫీ తాగడం వల్ల చాలామంది కోరుకునే మరో ప్లస్ పాయింట్. అదేంటంటే.. ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో జనాన్ని బాధిస్తోన్న సమస్య అధిక బరువు. ఔను, అధిక బరువు నుంచి బయటపడటం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని డైటింగ్స్ చేసినా అధిక బరువు తగ్గడం అనేది చాలామందికి ఒక కలగానే మిగిలిపోతోంది. అయితే, అలాంటి వారు ఈ బ్లాక్ కాఫీ తాగడం వల్ల వారిలో మెటాబాలిజం మెరుగుపడటమే కాకుండా అది ఒంట్లోని కొలెస్ట్రాల్ లెవెల్స్ ని అదుపులో పెట్టి అధిక బరువు తగ్గిస్తుంది.
బ్లాక్ కాఫీ తాగడం వల్ల లివర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ప్రస్తుత లైఫ్ స్టైల్లో మనం తీసుకునే అనేక రకాల జంక్ ఫుడ్స్, బేవరేజెస్ తో పాటు మన లైఫ్ స్టైల్ మన ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తున్నాయి. అందులోనూ ముఖ్యంగా లివర్ డ్యామేజ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే, బ్లాక్ కాఫీ తాగడం వల్ల లివర్ డ్యామేజ్ కాకుండా ఉండటంతో పాటు కాలేయాన్ని సైతం ఆరోగ్యంగా ఉంచుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గ్రీన్ టీ కూడా అధిక మోతాదులో సేవిస్తే లివర్ డ్యామేజ్ అవుతుందని హెల్త్ కేర్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. కానీ బ్లాక్ కాఫీ మాత్రం లివర్ డ్యామేజ్ అవకుండా కాపాడుతుంది అంటే దాని విశిష్టత, గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు.
బ్లాక్ కాఫీ తాగడం వల్ల మెదడుకు సైతం కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందులో జ్ఞాపక శక్తి , ఏకాగ్రత , చురుకుగా స్పందించే వేగం పెరగడం వంటి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. పరిశోధకులకు తమ పరిశోధనలపై దృష్టి సారించేందుకు బ్లాక్ కాఫీ లాంటివి బాగా సహాయపడుతుంటాయి అని చెబుతుంటారు. అందుకు కారణం ఇందులో కెఫైన్ కంటెంట్ ప్రధాన కారణం.
ఇది కూడా చదవండి : Side Effects of Green Tea: గ్రీన్ టీతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్.. గ్రీన్ టీతో వచ్చే అనారోగ్య సమస్యలు
సాధారణంగా కాఫీలో కెఫైన్ ఉంటుంది. బ్లాక్ కాఫీ కూడా కెఫైన్ కంటెంట్‌కి మినహాయింపు కాదు. బ్లాక్ కాఫీలో కూడా కెఫైన్ ఉంటుంది. ఈ కెఫైన్ మెదడును అప్రమత్తం చేయడంతో పాటు ఎనర్జి లెవెల్స్ పెరిగేలా చేస్తుంది.
ఇది కూడా చదవండి : Weight Loss At Home: రోజురోజుకి పొట్ట పెరిగిపోతోందా? లావుగా కనిపిస్తున్నారా? ఇలా ఉల్లి రసాన్ని తాగండి చాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి