Cardamom health benefits: యాలకలతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఎన్నో సమస్యలకు చెక్
Benefits of Cardamom : ఆహారానికి సువాసన ఇవ్వడంతో పాటు రక్తపోటును కూడా నియంత్రించడంలో యాలకలు సహాయపడతాయి అన్న విషయం చాలా మందికి తెలియదు. ఇంకా యాలకులు చాలా అనారోగ్య సమస్యలకు వంటింటి చిట్కాగా సులభంగా పనిచేస్తాయి. మరి ఆ చిన్నపాటి గొప్ప చిట్కాలు ఏమిటో తెలుసుకుందామా..
Cardamom for health: బిర్యానీ లేక పాయసం కోసమో తప్ప బయటకు తీయని యాలకులు ప్రతి వంటింట్లో భద్రంగా దాచిపెట్టబడతాయి. అయితే ఈ యాలకుల వల్ల మనకు పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం చాలామందికి తెలియదు. మనం ఎదుర్కొనే చిన్ని చిన్ని ఇబ్బందులకు వంటింటిలోని యాలకులు సులభమైన పరిష్కారాన్ని అందిస్తాయి. అజీర్తి దగ్గర నుంచి విరోచనం వరకు.. ఎసిడిటీ దగ్గర నుంచి కడుపుబ్బరం వరకు ..ఎన్నో సమస్యలను యాలకులు సులభంగా తగ్గిస్తాయి.
జీర్ణక్రియను బలోపేతం చేయడంతో పాటు రక్తపోటును తగ్గించి మన బీపీని కంట్రోల్ లో పెట్టే పవర్ యాలకలకు ఉంది. యాలకలు ఉపయోగించి అజీర్ణం, గుండె మంట, పేగుల సమస్యలు, విరోచనాలు వంటివి తగ్గించుకోవచ్చు. అద్భుతమైన వాసన ,రుచితో పాటు యాలకులకు ఆయుర్వేద పరంగా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే యాలకులకు ఆయుర్వేద వైద్యంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సుగంధ ద్రవ్యాల రాణిగా పిలిచే ఈ యాలకులను అనాదిగా భోజనం తర్వాత సేవించడం ఒక సంప్రదాయంగా మన పూర్వీకులు ప్రవేశపెట్టారు.
కాగా ఇది ఆచారం కాదు ..ఆరోగ్యం కోసం వాళ్ళు తీసుకున్న ముందు జాగ్రత్త. ఎందుకంటే భోజనం తర్వాత రెండు యాలకులు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుగా జరిగి తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.సుమారు 200 సంవత్సరాల క్రితం దక్షిణ భారతదేశంలో పశ్చిమ కనుమల లో ఉన్న అడవులలో పెరిగిన యాలకులు ఆ తరువాత ప్రపంచంలోని చాలా ప్రదేశాలకు సరఫరా చేయడం జరిగింది. మన ప్రాచీన ఆయుర్వేద గ్రంథమైన చరక సంహితలో కూడా యాలకుల గురించి ప్రస్తావన ఉంది. ఇందులో ఉన్న యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల ఇది మెదడును ఫ్రీ రాడికల్స్ భారీ నుంచి కాపాడడంలో సహాయపడుతుంది.
క్రమం తప్పకుండా రోజు యాలకులు తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండడంతో పాటు ఉదర సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. యాంటీ బాక్టీరియల్ లక్షణాల వల్ల దీని మౌత్ ఫ్రెషనర్ గా వాడుతారు. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ యాలకులు తీసుకోవచ్చు కానీ కొందరికి యాలకుల వల్ల ఎలర్జీ కలిగే అవకాశం ఉంది .అటువంటి వారు యాలకులు తీసుకునే ముందు తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచన మేరకు సేకరించడం జరిగింది .ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
Also Read: Mega Brothers Photo: ఒకే ఫ్రేమ్‌లో మెగా ఫ్యామిలీ.. కూల్ లుక్‌లో మెగా బ్రదర్స్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి