Brown Rice Benefits: వైట్ రైస్ తో పోలిస్తే.. బ్రౌన్ రైస్ ఎంతో పౌష్టికం మరియు లాభదాయకమైంది. ఇది శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వరి యొక్క పై భాగం.. పొత్తును తీసివేస్తే దాన్ని బ్రౌన్ రైస్ అంటారు. ఇది గోధుమ రంగులో ఉంటుంది. దీనిని శుభ్రం చేసి బ్రాన్ ని తొలగిస్తే మనకి తెల్లటి రైస్ లభిస్తుంది. బ్రౌన్ రైస్ తినడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. ఎందుకంటే తెల్లటి బియ్యాన్ని ఎక్కువ సార్లు పాలిష్ చేస్తారు.  దానివల్ల అందులో ఉండే కొన్ని పోషకాలు రైస్ నుండి విడిపోతాయి. ఇక బ్రౌన్ రైస్ విషయానికి వస్తే ఎక్కువగా పాలిష్ చేయబడదు కావున పోషకాలన్ని ఇందులో ఎక్కువగా ఉంటాయి. తెల్లటి రైస్ కంటే.. బ్రౌన్ రైస్ తినడం వల్ల ఎక్కువ లాభాలు కలుగుతాయి. బ్రౌన్ రైస్ వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్రౌన్ రైస్ వల్ల కలిగే లాభాలు  


గుండె ఆరోగ్యానికి మంచిది.. 
బ్రౌన్ రైస్ లో ఉండే పౌష్టిక తత్వాలు గుండె ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనవి. ఇందులో ఉండే ఫైబర్ గుండెకి సంబందించిన అన్ని రకాల సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. బ్రౌన్ రైస్ లో లిగ్నాన్ అనే సమ్మేళనం అధిక మొత్తంలో ఉంటుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో సహాయపడుతుంది, మరియు బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంచటంలో కేసుల సహాయపడుతుంది. 


Also Read: Pushpa 2:పుష్ప కొత్త షెడ్యూల్.. జాతర ఫైట్ తో మొదలు..


జీర్ణ వ్యవస్థ.. 
బ్రౌన్ రైస్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. బ్రౌన్ రైస్ లో ఉండే ఫైబర్ స్థాయిలు పేగు కదలికలను నియంత్రించడంలో మరియు మీ ప్రేగు కదలికలను సక్రమంగా ఉంచడంలో సహాయపడతాయి. పెద్దప్రేగు శోధనలో, మలబద్ధకం నయం చేయటంలో అద్భుతమైన ఫలితాలను కలిగిస్తుంది. 


బరువులో తగ్గుదల.. 
బ్రౌన్ రైస్ తినడం ద్వారా బరువుని కూడా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఇది రిఫైన్డ్ చేయబడదు. అలాగే వైట్ రైస్ లో ఫైబర్ మరియు పోషకాలు తక్కువగా ఉంటాయి. దీని వల్ల శరీరానికి కావాల్సిన పౌష్టికాలు లభించవు. బ్రౌన్ రైస్ లో పోషకాలు మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.కావున బ్రౌన్ రైస్ తినడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.


Also Read: Telangana: బీజేపీకు రాజీనామా, సొంతగూటికి చేరిన మాజీ ఎంపీ వివేక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..