ఉసిరి.. ఆరోగ్యానికి `సిరి`
ఉసిరికాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
ఉసిరికాయ... అంటే కేవలం చిన్నపిల్లలు తినడానికి పనికొచ్చే ఫలమో.. కాయో అని భావిస్తున్నారా.. కాదండీ బాబూ..! మంచి ఆరోగ్య సిద్ధికి పిల్లలతో పాటు పెద్దవారికి కూడా ఎంతో ఉపయోగకరం ఇది. మరి ఈ రోజు మనం కూడా ఈ ఔషధ ఫలం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం
- శరీరం పటుత్వం కోల్పోకుండా, బలంగా ఉండాలంటే ఉసిరి తినాల్సిందే. చ్యవనప్రాశ లేహ్యంతో కలిపిన ఉసిరికాయ గుజ్జును తింటే మీ బలం పెరగడానికి అదే మహా ఔషధం
- ఉసిరిలో విటమన్ సి ఉంటుంది. మధుమేహ వ్యాధి గ్రస్తులు ఎండబెట్టిన ఉసిరిపండ్ల చూర్ణంలో పసుపు ఒక గ్రాము, తేనె ఒక గ్రాము వేసుకొని రోజూ తింటే, షుగర్ వ్యాధి దూరమవునని కొందరు ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
- శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడానికి ఉసిరి ఎంతగానో తోడ్పడుతుంది. ఊపిరితిత్తులు, కాలేయం, జీర్ణమండలం మొదలైన వాటి సమస్యలకు తగ్గించడానికి ఉసిరి ఎంతగానో దోహదపడుతుంది.
- కంటి బాధలు ఉన్నవారు ఒక స్పూన్ ఉసిరి రసం, అర టీస్పూన్ తేనె కలిసి తాగితే రోజూ తాగితే ఆ సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.
- ఉసిరిలో ఉండే ఫైబర్ వల్ల పేగు కదలికలు మెరుగుపడి, జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉంటుంది.
- ఎండిపోయిన ఉసిరికాయతో బెల్లం కలిసి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆస్త్మా, బ్రోంచైటిస్ అనే వ్యాధులు తగ్గుముఖం పడతాయి. ఒక ఉసిరికాయ రెండు నారింజపండ్లతో సమానం అనే నానుడి కూడా ఉంది.
- ఉసికి కాయ జ్యూస్ రోజూ తాగడం వల్ల మూత్రనాళ సమస్యలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా యూనినర్ బర్నింగ్‌ను పారద్రోలడంలో ఉసిరి ప్రధాన పాత్ర పోషిస్తుంది.
- ఆడపిల్లల్లో నెలసరి సమస్యలు తగ్గించడానికి కూడా ఉసిరికాయ రసం ఎంతగానో తోడ్పడుతుంది.
- మొటిమల నివారణకు కూడా ఉసిరికాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫేషియల్ చేసుకుంటున్నప్పుడు ఉసిరికాయ పొడిని మిక్స్ చేసి ముఖానికి అద్దుకోవడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చు.
- అయితే ఉసిరిని తగుమాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే అనర్థాలు కూడా ఉన్నాయి సుమండీ.. అందుకే ఉసిరిని ఆహారంలో కొద్ది భాగంగానే తీసుకోవాలి తప్పితే.. ఎక్కువగా ఇష్టం వచ్చినట్లు తినకూడదు.