Pink Salt: ప్రతి భారతీయ కిచెన్‌లో తప్పకుండా వినియోగించే పదార్ధాల్లో మసాలా, ఉప్పు, కారం, గరం మసాలా దినుసులు చాలా కీలకం. అన్నింటికంటే ముఖ్యంగా ఉప్పు. శరీరానికి ఉప్పు అవసరమే అయినా ఎలాంటి ఉప్పు తీసుకోవాలి, ఎంత మోతాదులో అనేది చాలా అవసరం. అప్పుడే ఆరోగ్యం ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మసాలా పదార్ధాలు లేకుండా భారతీయ భోజనం అనేది దాదాపుగా ఉండదు. వీటితో పాటు ఉప్పు అత్యంత కీలకమైంది. సాధారణంగా రెండు మూడు రకాల ఉప్పు వినియోగిస్తుంటారు. కళ్లు ఉప్పు, రాక్ సాల్ట్ లేదా పింక్ సాల్ట్, సాధారణ ఉప్పు. ఈ మూడింట్లో పింక్ సాల్ట్ లేదా సేంథా నమక్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. పింక్ సాల్ట్, సాధారణ ఉప్పు మధ్య అంతరమేంటి, ఎలాంటి ప్రయోజనాలున్నాయనేది తెలుసుకుందాం.. పింక్ సాల్ట్ లేదా రాక్ సాల్ట్‌లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. పొటాషియం తగిన మోతాదులో తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండె రోగాలు తగ్గుతాయి.


పింక్ సాల్ట్ లేదా రాక్ సాల్ట్‌లో కాల్షియం, పొటాషియం తగిన మోతాదులో ఉంటాయి. ఇవి శరీర బరువు తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో ఉండే పోషకాలు స్థూలకాయం సమస్య నుంచి విముక్తి పొందేందుకు దోహదపడతాయి. అంతేకాకుండా డయాబెటిస్ నియంత్రణలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. పింక్ సాల్ట్‌లో నైట్రిక్ ఆక్సైడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. రక్తంలో షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తుంది. డయాబెటిస్ రోగులకు పింక్ సాల్ట్ చాలా మంచిది. సురక్షితమైంది.


పింక్ సాల్ట్‌లో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి ఎనర్జీ లభిస్తుంది. శరీరానికి బలం, శక్తి కలుగుతాయి. రోజంతా పనిచేసేందుకు కావల్సిన శక్తి లభిస్తుంది. అదే సమయంలో ఇందులో ఉండే జింక్ కారణంగా శరీరం ఎదుగుదల, అభివృద్ధి సాధ్యమౌతాయి. ఇమ్యూనిటీని పెంచేందుకు దోహదం చేస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ ఎముకలకు బలాన్నిఅందిస్తాయి,. బోన్ హెల్త్‌ను మెరుగుపరుస్తుంది. ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యల్ని దూరం చేస్తుంది.


పింక్ సాల్ట్‌లో సల్ఫర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఎముకలను పటిష్టం చేస్తుంది. నిర్ణీత మోతాదులో ఉపయోగిస్తే బోన్ హెల్త్ ఆరోగ్యంగా ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు దూరం చేయవచ్చు. పింక్ సాల్ట్ క్రమం తప్పకుండా ఉపయోగిస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 


Also read: Gastric Trouble Home Remedies: ఈ చిట్కాతో గుండెల్లో మంటను క్షణాల్లో మాయం చేయండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook