Amla Benefits: ఉసిరికాయతో కలిగే లాభాలు ఇవే!
Amla Fruit Benefits: ఉసిరికాయను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇందు అనేక రకాల పోషకాలు లభిస్తాయి.
Amla Fruit Benefits: ఉసిరికాయ ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఉసిరిలో విటమిన్ సి, ఎబి, మెగ్నీషియం, కాల్షియం ఇతర పోషకాలు అధికంగా లభిస్తాయి. అంతేకాకుండా ఐరన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ పుష్కలంగా దొరుకుతాయి.
డయబెటీస్ ఉన్నవారు ఈ ఉసిరికాయను తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఈ ఉసిరి ఎంతో మేలు చేస్తుంది.
గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షించడంలోనూ ఉసిరికాయ ఎంతో సహాయపడుతుంది. చర్మ సమస్యలతో బాధపడుతున్నవారు కూడా ఈ ఉసిరికాయను తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. తీవ్రమైన గాయాని కూడా రిపేర్ చేయడంలో ఈ ఉసిరి మేలు చేస్తుంది.
ఖాళీ కడుపుతో గూస్బెర్రీ జ్యూస్ త్రాగడం చాలా మంచిది. లివర్ సమస్య ఉన్నవారు ఉసిరి రసాన్ని తేనెతో కలిపి తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
Also read: Garlic Benefits: రోజూ పరగడుపున కాల్చిన వెల్లుల్లి తింటే కేన్సర్, డయాబెటిస్ , బీపీ అన్నీ మాయం
దీంతో జాండిస్‌తో బాధపడుతున్న వారికి ఉపశమనం కలుగుతుంది. ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగడం వల్ల అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు.ఉసిరికాయ రసంలోని ఫైబర్ మంచిదని నిపుణులు చెబుతున్నారు. జీవక్రియను పెంచడానికి, బరువు తగ్గడానికి ఉసిరి ఎంతగానో సహాయపడుతుంది.
అలాగే మీరు మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటే, ఉసిరికాయ రసాని తప్పకుండా తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది.
ఈ విధంగా ఉసిరికాయను తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Also read: Ragi Laddu Recipe: రాగి లడ్డు ఎలా తయారు చేయాలి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook