Leaves Benefits: ఈ ఆకుల్ని రోజూ తీసుకుంటే ఆ ప్రమాదకర వ్యాధులన్నీ దూరం
Leaves Benefits: ప్రకృతిలో లభించే చాలా రకాల ఆకుల్లో ఔషధ గుణాలు ఫుష్కలంగా ఉంటాయి. డయాబెటిస్, హార్ట్ ఎటాక్, జలుబు, దగ్గు వంటి వ్యాధుల్ని దూరం చేసేందుకు ఈ ఆకులు అద్భుతంగా ఉపయోగపడతాయి.
ప్రకృతిలో లభించే వివిధ రకాల మొక్కలు, చెట్లలో అద్భుతమైన ఔషధ గుణాలుంటాయి. ఈ ఆకులను సరైన రీతిలో సేవిస్తే ఎల్లప్పుడూ ఫిట్ అండ్ హెల్తీగా ఉంటారు. ఆకులతో వైద్యం అనేది అనాదిగా ఉన్నదే. ఈ ఆకుల వినియోగంతో ఎన్నోరకాల ప్రమాదకర వ్యాధులు కూడా ఇట్టే దూరమౌతాయి. ఆ వివరాలు మీ కోసం..
వేప ఆకులు
వేపలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వేపలో ఉండే పోషకాలు వివిధ రకాల వ్యాధుల్ని దూరం చేస్తుంది. ఈ ఆకులతో మధుమేహం నియంత్రణలో ఉంటుంది. వేపాకులతో ఇమ్యూనిటీ పెరుగుతుంది. వ్యాధుల్ని దూరం చేసేందుకు పనిచేస్తాయి. నోటి దుర్గంధం, పళ్ల స్వెల్లింగ్ దూరం చేయడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది.
తులసి ఆకులు
తులసి ఆకుల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో పోషక పదార్ధాలు చాలా వ్యాధుల్ని దూరం చేయడంలో ఉపయోగపడతాయి. తులసి ఆకులు తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. జలుబు, దగ్గు సమస్య దూరం చేసేందుకు ఉపయోగపడతాయి. చర్మం, కేశాలు, ఆరోగ్యానికి చాలా మంచిది.
పుదీనా ఆకులు
పుదీనా ఆకులు ఆరోగ్యానికి చాలా లాభదాయకం. పుదీనా ఆకులను పరగడుపున తీసుకంటే జీర్ణ సంబంధ సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉండే పోషకాలు చలవ చేస్తాయి. పుదీనా ఆకులతో గ్యాస్, బ్లోటింగ్, ఎసిడిటీ వంటి సమస్యలు దూరమౌతాయి.
జామాకులు
జామాకుల్లో పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకుల్ని తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. జామాకులతో జలుబు, దగ్గు వంటి సమస్యలు దూరమౌతాయి. జామాకుల్ని ఉడికించి తీసుకుంటే డయాబెటిస్ తగ్గుతుంది.
కరివేపాకులు
కరివేపాకుల ఉపయోగం సాధారణంగా వంటల్లో ఉపయోగిస్తారు. ఈ ఆకుల్లో అద్భుతమైన ఔషధ గుణాలుంటాయి. కరివేపాకుల్ని పరగడుపున తీసుకోవడం వల్ల డయాబెటిస్‌కు లాభదాయకం. కరివేపాకు గ్రైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. బ్లడ్ షుగర్ నియంత్రిస్తాయి.
Also read: How To Weight Loss: ఈ 4 చిట్కాలతో చలి కాలంలో అధిక బరువు, బెల్లీ ఫ్యాట్‌కు గుడ్ బై చెప్పండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook