Benifits of having Beard: `గడ్డం`తో మీకు తెలియని సీక్రెట్ హెల్త్ బెనిఫిట్స్...
Health Benifits of having beard: గడ్డం కేవలం ఫ్యాషన్ సింబలే కాదు.. దానితోనూ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇంగ్లాండ్‌కి చెందిన ఓ డాక్టర్ గడ్డం గురించి చెప్పిన కొన్ని హెల్త్ సీక్రెట్స్ వింటే ఆశ్చర్యపోక తప్పదు.
Health Benifits of having beard: బాగా గడ్డం (Beard) పెంచితే బూచోడిలా ఉన్నావని... క్లీన్ షేవ్‌లో కనిపిస్తే స్మార్ట్‌గా ఉన్నావని... ఎవరికైనా ఇలాంటి కామెంట్స్ ఎదురవడం సహజం. గడ్డమంటే కొంతమంది పరమ చిరాకుగా ఫీలవుతారు... మరికొంతమంది ఫ్యాషన్ సింబల్‌గా భావిస్తారు... అయితే అంతవరకే కాదు... గడ్డంతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇంగ్లాండ్‌లోని (England) సండర్‌ల్యాండ్ యూనివర్సిటీకి చెందిన సర్జికల్ డాక్టర్, లెక్చరర్ డా.కరణ్ రంగార్జన్ గడ్డంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
షార్ట్ వీడియోస్ యాప్ టిక్‌టాక్‌లో (TikTok) యాక్టివ్‌గా ఉండే డా.కరణ్ మెడికల్ అంశాలపై తన వీడియోల ద్వారా అవగాహన కల్పిస్తుంటారు. తాజాగా ఆయన 'గడ్డంతో హెల్త్ బెనిఫిట్స్' అనే టాపిక్‌గా మాట్లాడారు. ముఖం నున్నగా, క్లీన్ షేవ్‌తో ఉండటం కన్నా.. కాస్త గడ్డం పెంచుకోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. 'ఒక పరిశోధన ప్రకారం... ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందిలో గడ్డంతో ఉన్నవారి కంటే గడ్డం లేనివారి ముఖంపై MRSA అనే బాక్టీరియా (Bacteria) ఉండేందుకు మూడు రెట్లు ఎక్కువ అవకాశం ఉంది.' అని పేర్కొన్నారు.
MRSA అనే బాక్టీరియా చాలా రకాల యాంటీ బయాటిక్స్‌ను (Antibiotics) సైతం తట్టుకునే నిరోధకతను కలిగి ఉంటుందని కరణ్ తెలిపారు. ఒకరకంగా పలు ఇన్ఫెక్షన్లకు ఇచ్చే ట్రీట్‌మెంట్ కంటే దీన్ని ట్రీట్ చేయడం కష్టమన్నారు. క్లీన్ షేవ్ (Clean Shave) చేసుకునే సమయంలో చర్మం రాపిడికి గురై సూక్ష్మమైన పగుళ్లు ఏర్పడుతాయని... అక్కడే MRSA బాక్టీరియా వృద్ది చెందుతుందని అన్నారు. కాబట్టి క్లీన్ షేవ్ కంటే కాస్త గడ్డం పెంచితే ఈ బాక్టీరియా పెరిగే అవకాశం తక్కువ ఉంటుందన్నారు.
అంతేకాదు, గడ్డం వల్ల ముఖంపై చర్మం సూర్యుని అతినీల లోహిత కిరణాల బారినపడకుండా ఉంటుందని అన్నారు. తద్వారా చర్మ క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయన్నారు. టిక్‌టాక్‌లో డా.కరణ్ పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పటికే వైరల్‌గా మారింది. ఇప్పటివరకూ దాదాపు 3లక్షల వ్యూస్‌తో పాటు వందల కొద్ది కామెంట్స్ వచ్చాయి. గడ్డం (Beard Styles) గురించి డా.కరణ్ చెప్పింది విన్న తర్వాత.. చాలామంది దీని వెనకాల ఇంత కథ ఉందా అని అభిప్రాయపడుతున్నారు.
Also Read: Flipkart Sale: రూ.30 వేల కంటే తక్కువ ధరతో iPhone 12 మీ సొంతం చేసుకోండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook