మనం రోజూ తినే ఆహారం శరీరంలో సరిగ్గా జీర్ణమైతేనే ఆరోగ్యం ఉంటుంది. లేకపోతే చాలా సమస్యలు వెంటాడుతాయి. అందుకే మెరుగైన జీర్ణక్రియ కోసం ఆ మసాలా నీళ్లు తప్పకుండా తాగాలంటున్నారు వైద్య నిపుణులు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలామందికి భోజనం తరువాత కడుపులో మంట లేదా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్యతో బాధపడేవారు భోజనం తరువాత కొద్దిగా జీలకర్ర, వాము నీరు తాగితే చాలా సమస్యల నుంచి ఉపశమం కలుగుతుంది. ప్రతిరోజూ భోజనం తరువాత జీలకర్ర-వాము నీరు తాగడం వల్ల ఏయే ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.


జీలకర్ర, వాము రెండింటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల శరీరంలో ఏ విధమైన స్వెల్లింగ్ ఉండదు. జీలకర్ర నీళ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. శరీరంలో నీటి కొరతను తగ్గిస్తాయి. దాంతోపాటు జీర్ణక్రియ అద్భుతంగా మెరుగుపడుతుంది.


ముందుగా జీలకర్ర, వామును నీళ్లలో వేసి బాగా ఉడికించాలి. ఈ నీళ్లు చల్లారిన తరువాత భోజనం తరువాత మద్యాహ్నమైనా, రాత్రైనా తీసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనకరం. ఇందులో తక్కువ కేలరీలు ఉండటం వల్ల అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం మెటబోలిజంను వేగవంతం చేస్తుంది. శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. కేన్సర్ ముప్పును కూడా తగ్గిస్తుంది. శరీరాన్ని హైడ్రైట్‌గా ఉంచుతుంది. ఈ నీళ్లు రోజూ తాగితే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. మరీ ముఖ్యంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించేందుకు ఉపయోగపడతాయి.


Also read: Tea Side Effects: టీ తాగడం వల్ల కలిగే 5 ప్రధాన సమస్యలు ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook