Summer Care: వేసవిలో డయాబెటిస్ రోగులు తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి
Summer Care: వేసవిలో డయాబెటిస్ రోగులకు ఇబ్బందే. అందుకే వేసవి కాలంలో డయాబెటిక్ రోగులు కాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఈ నేపధ్యంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం..
Summer Care: వేసవిలో డయాబెటిస్ రోగులకు ఇబ్బందే. అందుకే వేసవి కాలంలో డయాబెటిక్ రోగులు కాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఈ నేపధ్యంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం..
వేసవి ఎండల తీవ్రత అధికంగా ఉంటే..మీ బ్లడ్ షుగర్ నియంత్రణలో లేకపోతే..డయాబెటిక్ రోగులకు కష్టంగా మారుతుంది. అంతేకాదు మధుమేహం కారణంగా మీ చెమట గ్రంథులు కూడా చెడిపోతాయి. ఈ కారణంగా..డయాబెటిస్ రోగులకు చెమట కూడా సరిగ్గా రాదు. ఎందుకంటే వేసవి వేడి ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో మీ ఆరోగ్యం గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో డయాబెటిక్ రోగులు ఏయే విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలో పరిశీలిద్దాం..
మీ బ్లడ్ షుగర్ పెరగడానికి ముఖ్య కారణం డీ హైడ్రేషన్ కూడా. డీ హైడ్రేషన్ నుంచి కాపాడుకునేందుకు సాధ్యమైనంతవరకూ ఎక్కువ నీళ్లు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. వేసవిలో బయటి ఉష్ణోగ్రత మీ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. అందుకే సాధ్యమైనంత ఎక్కవగా షుగర్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీ షుగర్ లెవెల్ ప్రకారం డయాబెటిస్ నియంత్రణలో ఉంచుకునేందుకు ప్రయత్నించవచ్చు.
వేసవికాలంలో డయాబెటిస్ రోగులకు ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ డైట్‌లో షుగర్ లెవెల్స్ పెంచని పండ్లు ఉండేలా చూసుకోవాలి. డయాబెటిస్ రోగులకు ఖీరా అనేది అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. షుుగర్ లెవెల్స్ పెంచకపోగా..బాడీ డీ హ్రైడ్రేట్ కాకుండా చేస్తుంది. ఎందుకంటే ఖీరాలో నీటి శాతం చాలా ఎక్కువ.
Also read: Skin Glowing Foods: చర్మం నిగనిగలాడాలని కోరుకుంటున్నారా.. అయితే క్రమం తప్పకుండా వీటిని తినండి..!
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook