Honey with Cold Milk: పాలు, తేనె ఆరోగ్యానికి చాలా మంచివి. ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. చల్లటి పాలలో తేనె కలుపుకుని తాగితే..కలిగే లాభాలేంటో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెరుగైన ఆరోగ్యానికి కావల్సిన ఎన్నో పోషక గుణాలు పాలు, తేనెలో పుష్కలంగా లభిస్తాయి. రెండూ కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఇంకా మంచిదంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. పాలలో తేనె కలుపుకని తాగితే..ఆరోగ్యానికి నిజంగా చాలా మంచిది. ముఖ్యంగా ఆ పాలు చల్లగా ఉంటే మరీ మంచిది. చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరమౌతాయి. కోల్డ్‌మిల్క్‌లో తేనె కలుపుకుని తాగితే కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం..


కోల్డ్‌మిల్క్‌లో తేనె కలుపుకుని తాగితే..కడుపులో సహజంగా ఎదురయ్యే గ్యాస్ సమస్య ఉండదు. దాంతోపాటు ఎసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు..కడుపులో ఏర్పడే చిన్న చిన్న అల్సర్స్ వంటివి నయమౌతాయి. పాలు, తేనె కలిపి తాగడం వల్ల శరీరంలో ఫ్రురక్టోజ్ అవశేషణం జరుగుతుంది. ఫలితంగా మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. మరోవైపు మీరు వర్కవుట్స్ చేసినప్పుడు చల్లనిపాలలో తేనె కలుపుకుని తాగితే తక్షణ శక్తి లభిస్తుంది. దాంతోపాటు మాంసపు కండరాల్లో కలిగే అలసట పోతుంది. 


పాలలో తేనె కలుపుకుని తాగడం వల్ల బరువు కూడా తగ్గుతుంది. బాడీ మెటబోలిజంను ఇది వేగవంతం చేస్తుంది. మెటబోలిజం ఎప్పుడైతే సరిగ్గా ఉంటుందో..అధికంగా ఉన్న కేలరీలు బర్న్ అవుతాయి. ఫలితంగా బరువు తగ్గుతారు. అతిగా తినేవాళ్లకు ఇది చాలా మంచిది. 


Also read: Dandruff Problem: ఈ విటమిన్లు లోపిస్తే డేండ్రఫ్ సమస్య..నిర్లక్ష్యం వద్దు



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook