Cancer Signs: కేన్సర్ ఒక ప్రాణాంతక వ్యాధి. అందుకే కేన్సర్ పేరు చెబితే చాలు భయం కలుగుతుంది. ప్రారంభంలో కేన్సర్‌ను గుర్తించగలిగితే చికిత్స కూడా సాధ్యమైనంటున్నారు వైద్య నిపుణులు. మరి ఎలా గుర్తించాలి, లక్షణాలు ఎలా ఉంటాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేన్సర్ విషయంలో చాలామంది ప్రారంభ లక్షణాల్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఎందుకంటే ఈ లక్షణాలు సాధారణంగా ఇతర వ్యాధుల లక్షణాలను పోలి ఉంటాయి. అందుకే శరీరంలోని చిన్న చిన్న మార్పులు, లక్షణాల్ని కూడా గుర్తించి అప్రమత్తం కావల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా సందర్బాల్లో చిన్న చిన్న లక్షణాలే సీరియస్ వ్యాధులకు కారణమౌతుంటాయి. అలాంటి కొన్ని సైలెంట్ లక్షణాలు తెలుసుకుందాం.


శరీరం అకస్మాత్తుగా బరువు తగ్గుతుంటే అది కేన్సర్ లక్షణం కావచ్చు. కేన్సర్ సెల్స్ వేగంగా విభజన చెందుతుంటాయి. దాంతో శరీరం నుంచి ఎనర్జీ ఎక్కువగా ఖర్చవుతుంది. ఫలితంగా అకారణంగా బరువు తగ్గిపోతుంటారు. శరీరంలో గాయం లేదా స్వెల్లింగ్ కూడా మరో ప్రధాన లక్షణం. శరీరంలో ఎక్కడైనా అకారణంగా కాయ రావడం లేదా స్వెల్లింగ్ ఉండటం అనేది కేన్సర్ లక్షణం కావచ్చు. ప్రత్యేకించి బ్రెస్ట్, టెస్టికల్స్, మెడ భాగంలో ఇలాంటి పరిస్థితి ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించాలి. 


ఆహారం మింగడంలో ఇబ్బంది ఏర్పడటం కూడా ఇంకో లక్షణం. నోరు, గొంతు, జీర్ణ వ్యవస్థలో ఎక్కడైనా సరే కేన్సర్ ట్యూమర్ ఏర్పడితే భోజనం తినడంలో మింగడంలో సమస్య ఏర్పడుతుంది. మలం నుంచి రక్తం కారడం, మహిళల్లో నెలసరి కాకుండా ఇతర సమయాల్లో బ్లీడింగ్ , గాయం లేకుండా రక్తం రావడం కేన్సర్ లక్షణాలే. 


తరచూ అలసిపోవడం కేన్సర్ లక్షణం కావచ్చు. అకారణంగా అంటే ఏ పనీ చేయకుండానే అలసిపోతుంటే కేన్సర్‌ను అనుమానించవచ్చు. కేన్సర్ ప్రారంభ లక్షణం కావచ్చు ఇది. శరీరంలో ఏదైనా భాగంలో అదే పనిగా నొప్పి కూడా కేన్సర్ సంకేతం కావచ్చు. ఎముకల్లో నొప్పి రాత్రి వేళ అధికమౌతుంటే కేన్సర్ లక్షణం కావచ్చు. మహిళల్లో నెలసరి సమయం మారినా లేదా అసామాన్యంగా బ్లీడింగ్ అవుతున్నా,మెనోపాజ్ తరువాత కూడా బ్లీడింగ్ అవుతుంటే కేన్సర్ ముప్పు కావచ్చు. 


చర్మంలో మార్పులు ప్రధానంగా గమనించవచ్చు. చర్మం రంగు మారడం వంటిది కేన్సర్ లక్షణం కావచ్చు. గాయం త్వరగా మానకపోయినా, చర్మంపై దురద ఉన్నా కేన్సర్ లక్షణం కావచ్చు.


Also read: Healthy Juice: రోజూ ఈ 5 రూపాయల జ్యూస్ పరగడుపున తాగితే వ్యాధులకు చెక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook