Heart Health Tips: మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే..గుండె ఆరోగ్యంగా ఉండాలి. అందుకే గుండె సంబంధిత వ్యాధులున్నవాళ్లు పొరపాటున కూడా కొన్ని వస్తువులు తినకూడదంటారు. అవేంటో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆరోగ్యంగా, ప్రాణాలతో జీవించేందుకు గుండె ఆరోగ్యం చాలా అవసరం. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహార పదార్ధాలు హెల్తీగా ఉండాలి. డైట్ అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు డైట్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గుండె ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవాలి. మీరు తీసుకునే ఆహారం ఆరోగ్యకరమైందిగా ఉంటే..చాలా వ్యాధుల్నించి కాపాడుకోవచ్చు. అదే సమయంలో గుండె వ్యాధిగ్రస్థులు కొన్ని పదార్ధాలను పొరపాటున కూడా తినకూడదు. ఏయే ఆహార పదార్ధాల్ని తినకూడదో చూద్దాం..


ఉప్పు అనేది సహజంగానే ఆహారం రుచిని పెంచుతుంది. కానీ ఎక్కువ మోతాదులో ఉప్పు శరీరానికి చాలా ప్రమాదకరం. ఉప్పు వల్ల శరీరంలో రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండెకు ఏ మాత్రం మంచిది కాదు. హానీ కలిగిస్తుంది. అంతేకాకుండా..గుండె వ్యాధిగ్రస్థులకు మరింత సమస్యాత్మకంగా మారుతుంది. మీరు ఒకవేళ హార్ట్ పేషెంట్ అయితే మాత్రం ఉప్పను దూరంగా పెట్టండి.


మైదా శరీరానికి చాలా హానికరం. ఇదొక స్లో పాయిజన్ లాంటిది. మైదా వల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్ ముప్పు పెరిగిపోతుంది. మైదాను పూర్తిగా దూరం పెట్టాలి. శరీరంలోని వివిధ భాగాలకు రక్తం సరఫరా అయ్యే మార్గంలో కొలెస్ట్రాల్ పేరుకుంటుంది. అందుకే గుండె సమస్యలున్నవాళ్లు..మైదాతో చేసిన పదార్ధాలు బ్రెడ్, బర్గర్, చౌమీన్ వంటివి తినకూడదు.


టీ-కాఫీ కూడా ఆరోగ్యానికి హాని కల్గించేవే. హార్ట్ రోగులు సాధ్యమైనంతవరకూ టీ, కాఫీలకు దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే టీ, కాఫీ వల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. తద్వారా గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. మరోవైపు కూల్ డ్రింక్స్ కూడా తాగకూడదు.


Also read: Weight loss Program: ఆ రెండు పరగడుపున తింటే చాలు..4 వారాల్లో అధిక బరువుకు చెక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook