High Blood Pressure: ఈ చిట్కాలు పాటిస్తే..ఏ మందుల్లేకుండానే రక్తపోటు సమస్యకు చెక్
High Blood Pressure: ఇటీవల చాలాకాలంగా అధిక రక్తపోటు కేసులు పెరుగుతున్నాయి. కొన్ని సులభమైన చిట్కాలతో ఈ సమస్యను నియంత్రించవచ్చు. అధిక రక్తపోటు సమస్య ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం..
ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా అధిక రక్తపోటు సమస్య సాధారణమైపోయింది. మొదట్లో వృద్ధులకే ఉండే ఈ సమస్య తరువాత..అందరిలోనూ కన్పిస్తోంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే...ఏ విధమైన మందుల్లేకుండానే అధిక రక్తపోటును నియంత్రించవచ్చు. ఎందుకంటే అధిక రక్తపోటును తేలిగ్గా తీసుకోకూడదు. రక్తపోటు కారణంగా హార్ట్ ఎటాక్, స్ట్రోక్ సమస్య ఎక్కువౌతుంది. అందుకే రక్తపోటును ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి.
అధిక రక్తపోటును నియంత్రించే చిట్కాలు
డార్క్ చాకొలేట్
అధిక రక్తపోటును నియంత్రించేందుకు డార్క్ చాకొలేట్ అత్యద్భుతంగా పనిచేస్తుంది. డార్క్ చాకొలేట్‌లో ఉండే ఫ్లెవనాయిడ్స్ ధమనులకు విశ్రాంతి ఇస్తాయి. రోజూ డార్క్ చాకొలేట్ తింటే..అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగని ఎక్కువ తినకూడదు.
మద్యం హానికరం
మద్యం ఆరోగ్యానికి పూర్తిగా హానికరం. మద్యం తాగడం వల్ల రక్తపోటు సమస్య పెరిగిపోతుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారు ఆల్కహాల్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి. లేకపోతే హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు అధికమౌతాయి.
తృణధాన్యాలు
అధిక రక్తపోటు సమస్య ఉన్నప్పుడు డైట్‌లో తృణధాన్యాల్ని తప్పకుండా చేర్చుకోవాలి. ఎందుకంటే తృణధాన్యాలనేవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటితో పాటు పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవాలి.
ఇక చివరిగా ఒకే చోట కూర్చోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. కూర్చుని చేసే పని ఉన్నా..ప్రతి అరగంటకోసారి 2 నిమిషాలు బ్రేక్ తీసుకుని అటూ ఇటూ నడుస్తుండాలి. ఇలా చేయడం వల్ల శారీరక శ్రమ ఉంటుంది.
Also read: Cholesterol: కొలెస్ట్రాల్ ఎంతవరకూ ప్రమాదకరం, ఏయే వ్యాధుల ముప్పు ఉంటుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook