Monsoon Diseases: వర్షాకాలం పీక్స్‌కు చేరింది. సీజనల్ వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లతో అప్రమత్తత అవసరం. తరచూ జ్వరం, జలుబు, దగ్గు సమస్యల్నించి దూరమయ్యేందుకు ఈ మూడు వస్తువులు తప్పకుండా వినియోగించాల్సిందే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వర్షాకాలం అంటే ఇష్టం లేకుండా ఎవరూ ఉండరు. అదే సమయంలో వివిధ రకాల వ్యాధుల్నించి రక్షించుకునేందుకు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వర్షాకాలంలో సహజంగానే వైరల్ ఫీవర్లు, ఇన్‌ఫెక్షన్లు వెంటాడుతుంటాయి. వాతావరణం మీకు ఎంతగా నచ్చినా..అంతే అప్రమత్తంగా లేకపోతే సీజనల్ వ్యాధులు చుట్టుముడతాయి. తరచూ జలుబు, జ్వరం, దగ్గు వంటి సమస్యలతో పాటు వివిధ రకాల చర్మ సమస్యలు కూడా ఎదురౌతుంటాయి. ఈ సమస్యల్నించి దూరమయ్యేందుకు కొన్ని సులభమైన చిట్కాలు పాటించాలంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు..


కొబ్బరి నూనె


కొబ్బరి నూనె అద్భుతమైన ఔషధం. సాధారణంగా జుట్టు సంరక్షణ, ముఖానికి మాత్రమే వాడతారని అనుకుంటారు. కానీ దక్షిణ భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో కొబ్బరి నూనెను వంటకు కూడా ఉపయోగిస్తుంటారు. ఇందులో ఉండే హెల్తీ ఫ్యాట్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయం వేళ కొబ్బరినూనెతో వండిన ఆహారం తీసుకుంటే జలుబు, దగ్గు, జ్వరం సమస్యలకు చెక్ పెట్టవచ్చు.


గోరు వెచ్చని నీళ్లు


వర్షాకాలంలో అంటువ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎప్పుడూ గోరు వెచ్చని నీళ్లను తాగడమే మంచిది. దీనివల్ల ఇన్‌ఫెక్షన్ దూరమవడమే కాకుండా..జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. 


అల్లం


ఇక ప్రతి వంటింట్లో తప్పకుండా లభించే పదార్ధమిది. అల్లంతో కలిగే ప్రయోజనాలకు పరిమితి లేదనే చెప్పాలి. వంటల రుచి పెంచేందుకు వినియోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇది లేకుండా టీ తాగనే తాగరు. జలుబు, దగ్గు, జ్వరం నుంచి ఉపశమనం పొందాలన్నా..వాటి నుంచి సంరక్షించుకోవాలన్నా అల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది. అల్లం రసం తాగవచ్చు లేదా టీలో కలుపుకుని సేవించవచ్చు. అల్లం, ఉసిరికాయ కలిపి తీసుకున్నా మంచి ఫలితాలుంటాయి.


Also read: Belly Fat: బెల్లీ ప్యాట్‌తో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే 7 రోజుల్లో సులభంగా కరిగిపోతుంది..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook